Allu Arjun – Pushpa: అల్లు అర్జున్‌కు విలన్‌గా సునీల్!!

క్రేజీ ప్రాజెక్టుకు మాజీ కమెడియన్ ను విలన్ గా వాడేస్తుంది పుష్ప మూవీ టీం. మాలీవుడ్ యాక్టర్.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా సినిమా రెడీ అవుతుంది అనే కదా ప్రచారం జరిగింది. ఇప్పుడు సునీల్ విలన్ ఏంటి అనుకుంటున్నారా.. అదే కదా ట్విస్ట్ మన లెక్కల మాస్టర్ సుకుమార్ ఫార్ములా ఇది.

Allu Arjun – Pushpa: అల్లు అర్జున్‌కు విలన్‌గా సునీల్!!

Allu Arjun Sunil

Allu Arjun – Pushpa: క్రేజీ ప్రాజెక్టుకు మాజీ కమెడియన్ ను విలన్ గా వాడేస్తుంది పుష్ప మూవీ టీం. మాలీవుడ్ యాక్టర్.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా సినిమా రెడీ అవుతుంది అనే కదా ప్రచారం జరిగింది. ఇప్పుడు సునీల్ విలన్ ఏంటి అనుకుంటున్నారా.. అదే కదా ట్విస్ట్ మన లెక్కల మాస్టర్ సుకుమార్ ఫార్ములా ఇది.

ఆడియెన్స్ కు అంత ఈజీగా తన సినిమా అర్ధమైతే ఎలా… త్వరలో ఫుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పెద్ద ట్విస్ట్ తో రెడీ చేస్తున్న సినిమాను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి సాధ్యమైతే దసరాకు గిఫ్ట్ గా రిలీజ్ చేయనున్నారు. రెండు భాగాల్లో రానున్న సినిమా తొలి భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్లాన్‌లో ఉంది పుష్ప టీం.

లారీ డ్రైవర్ రోల్ లో ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తుండగా.. బన్నీకి సవాల్ విసిరే పాత్రను మళయాల నటుడు ఫాహద్ ఫాజిల్ చేయబోతున్నాడు. ఇక్కడే ఒక్క ట్విస్ట్ ఉంది అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు విలన్ రోల్ లో కనిపిస్తాడంటూ హింట్ వదిలేసింది సినిమా యూనిట్.

టాలీవుడ్ టాప్ కమెడియన్ సునీల్ కూడా పుష్పలో కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సునీల్ అనగానే ఒకప్పుడు కామెడీ సీన్స్ గుర్తొచ్చేవి కానీ.. హీరో నుంచి అవతారం మార్చి డిస్కో రాజా, కలర్ ఫోటో సినిమాలతో విలన్ అయిపోయాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ లో సునీల్ విలన్ అయితే సెకండ్ పార్ట్ లో ఫాహద్ ఉంటాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.