Jailer Movie: జైలర్ మూవీలో జాయిన్ అయిన మంగళం శ్రీను!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Jailer Movie: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Jailer : రజినీకాంత్ సినిమాలో మోహన్ లాల్ గెస్ట్ అపియరెన్స్..
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది. ఈమేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు జైలర్ మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
ఈ చిత్ర సెట్స్ నుండి సునీల్ ఫోటోను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రలో నటించి యావత్ ఇండియా చూపును తనవైపు తిప్పుకున్న సునీల్‌కు ఆ తరువాత ఇతర భాషల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఏకంగా రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఆయన లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.