Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..

సునీల్ మాట్లాడుతూ.. F3, పుష్ప రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరిగాయి. కొన్ని సార్లు ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్స్ కి వెళ్ళేవాడిని. ఒకదాంట్లో కామెడీ, ఇంకో దాంట్లో విలన్.........

Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..

Sunil

Sunil :  కమెడియన్ సునీల్ ఇటీవల కామెడీతో పాటు విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత సునీల్ F3 సినిమాతో మరోసారి ఫుల్ లెంగ్త్ లో నవ్వించబోతున్నారు. F3 సినిమా మే 27న థియేటర్లలో రిలీజ్ కానుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

సునీల్ మాట్లాడుతూ.. ”F3, పుష్ప రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరిగాయి. కొన్ని సార్లు ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్స్ కి వెళ్ళేవాడిని. ఒకదాంట్లో కామెడీ, ఇంకో దాంట్లో విలన్.. ఇలా వెంటవెంటనే రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించేసరికి దూల తీరిపోయింది. పొద్దున్న కామెడీ, రాత్రికి విలన్ గా చేయడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఇప్పుడు నేను ఎలాంటి క్యారెక్టర్స్ వేయడానికి అయినా రెడీనే. వచ్చిన అవకాశానికి వంద శాతం న్యాయం చేయడానికి ట్రై చేస్తాను.”

Shanmukh – Siri : జాక్‌పాట్ కొట్టిన షన్ను, సిరి.. వెబ్ సిరీస్‌తో ఆహాలో ఎంట్రీ

”నవ్వించే సినిమాలు చేయడం, నలుగురిని నవ్వించడం అంత తేలిక కాదు. నవ్వడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్తారు కూడా. ఇటీవల కామెడీ సినిమాలు అంతగా రావట్లేదు. కామెడీ సినిమాలు ఎక్కువగా రావాలి, ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. అన్ని జోనర్లో సినిమాలు రావాలి కానీ కామెడీ సినిమాలు ఎక్కువ వస్తే ఇంకా మంచిది. ప్రస్తుతం తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్రలు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా వచ్చాయి. వేరే భాషల్లో కూడా సినిమాలు చేయబోతున్నాను” అని తెలిపారు.