KL Rahul-Athya : క్రికెటర్ KL రాహుల్ తో బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టి వివాహం.. త్వరలోనే అంటూ స్పందించిన సునీల్ శెట్టి..

తాజాగా అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి వీరి వివాహం గురించి మాట్లాడారు. సునీల్ శెట్టి ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''పెళ్లి జరిపించేందుకు మేము రేడేగానే ఉన్నాం. ఎప్పుడు చేసుకుంటారు అనేది పిల్లలు నిర్ణయించుకుంటారు. రాహుల్ వరుసగా...........

KL Rahul-Athya : క్రికెటర్ KL రాహుల్ తో బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టి వివాహం.. త్వరలోనే అంటూ స్పందించిన సునీల్ శెట్టి..

Sunil Shetty spoke about KL Rahul Athya shetty Marriage

KL Rahul-Athya :  క్రికెటర్లకు, బాలీవుడ్ హీరోయిన్స్ కి ఉన్న సంబంధం అందరికి తెలిసిందే. చాలా మంది స్టార్ క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్స్ నే వివాహం చేసుకున్నారు. ఇదే బాటలో మరో జంట రెడీ అవ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టి కొన్నేళ్లుగా ఇండియన్ క్రికెటర్ KL రాహుల్ తో ప్రేమలో ఉంది. ఈ సంగతి అందరికి తెలిసిందే. అయితే పెళ్లి మాట తెస్తే మాత్రం ఎవ్వరూ సమాధానం ఇవ్వట్లేదు. సినిమాలతో అతియా, మ్యాచ్ లతో రాహుల్ బిజీగా ఉంటున్నారు.

తాజాగా అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి వీరి వివాహం గురించి మాట్లాడారు. సునీల్ శెట్టి ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”పెళ్లి జరిపించేందుకు మేము రేడేగానే ఉన్నాం. ఎప్పుడు చేసుకుంటారు అనేది పిల్లలు నిర్ణయించుకుంటారు. రాహుల్ వరుసగా బిజీ షెడ్యూల్స్ తో ఉన్నాడు. ఖాళీ దొరికినా వారం రోజులు కూడా ఉండట్లేదు. పెళ్లంటే వెంటనే అయిపోదు కదా. అందుకే రాహుల్ షెడ్యూల్స్ ని బట్టి పెళ్లి ఉండొచ్చు త్వరలోనే” అని తెలిపారు.

Anasuya – Sraddhadas : ఆంటీ అటాక్.. అనసూయ మీద నుంచి శ్రద్ధాదాస్‌కు.. వదలంటున్న నెటిజన్లు.. తగ్గేదేలే అంటున్న అనసూయ..

సునీల్ శెట్టి డైరెక్ట్ గా రాహుల్ పేరు ప్రస్తావిస్తూ పెళ్లి గురించి మాట్లాడటంతో రాహుల్-అతియా త్వరలోనే ఒక్కటవబోతున్నారు అని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రికెట్ బాలీవుడ్ కపుల్ పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.