మహిళా దినోత్సవం….సన్నీలియోన్ బంపరాఫర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2020 / 01:04 PM IST
మహిళా దినోత్సవం….సన్నీలియోన్ బంపరాఫర్

సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో సన్నీ ఒకరు. 2012లో జిస్మ్2 థ్రిల్లర్ మూవీతో బాలీవుడ్ లోకి సన్నీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలుగు సినిమాలో కూడా సన్నీ నటించింది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ,యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో సన్నీ నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు తన టిక్‌టాక్ వీడియోలకు చాలా ఫేమస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం సర్ ప్రైజ్ చేస్తూ…మనదేశంలో గూగుల్ లో ఎక్కువమంది వెతికిన వారి లిస్ట్ లో టాప్ లో ఉంది సన్నీలియోన్. 

సన్నీ లియోన్‌ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంపై కూడా దృష్టిసారించారు. స్టార్ స్టక్ పేరిట సన్నీ సౌందర్య ఉత్పత్తుల కంపెనీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సన్నీ స్టార్‌ స్టక్‌ ప్రొడక్ట్స్‌ గురించి ప్రచారం చేస్తుంటారు. ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్‌ స్టక్‌ ప్రొడక్ట్స్‌పై సన్నీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. 

ముందుగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సన్నీ….ఈ అద్భుతమైన రోజున తన స్టార్‌ స్టక్‌ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ స్టాక్‌ అందుబాటులో ఉన్నంత వరకు వర్తిస్తుందని తెలిపింది. మీ గ్లామర్‌ కోసం త్వరపడండి అంటూ వీడియోను సన్నీలియోన్ పోస్ట్‌ చేసింది. 

ప్రస్తుతం సన్నీ బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన భర్త, పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ విశేషాలను కూడా సన్నీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారనే విషయం తెలిసింది. 2011లో మ్యూజిషియన్ అయిన డానియల్ వీబర్ ని సన్నీ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకొని వారిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. సన్నీ మనసు నిజంగా వెన్న అని ఆమె అభిమానులు అంటుంటారు.

>