Manchu Vishnu: మంచు విష్ణుకి 10 కోట్లు తెచ్చిపెడుతున్న సన్నీలియోన్..

మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం "జిన్నా". ఇటీవల విడుదలయిన ఈ సినిమా సినీ ప్రేమికులను ఆకట్టుకోలేక డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా హిందీ విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా హిందీ హక్కులు...

Manchu Vishnu: మంచు విష్ణుకి 10 కోట్లు తెచ్చిపెడుతున్న సన్నీలియోన్..

Sunny Leone bringing 10 crores to Manchu Vishnu Ginna Movie

Manchu Vishnu: మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం “జిన్నా”. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్ యాక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోన వెంకట్ కథ మరియు స్క్రీన్ ప్లే అందించగా.. మోహన్ బాబు, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.

Manchu Vishnu : సినిమా రిలీజ్ కాకుండానే జిన్నాపై నెగిటివ్ రివ్యూలు.. ఆ ఛానల్స్ ఇకపై ఉండవు.. మంచు విష్ణు వార్నింగ్..

ఇటీవల విడుదలయిన ఈ సినిమా సినీ ప్రేమికులను ఆకట్టుకోలేక డిజాస్టర్‌గా నిలిచింది. జిన్నా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కమర్షియల్ విజయం సాధించకపోయినా మంచు విష్ణుకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఈ సినిమా హిందీ విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా హిందీ హక్కులు రూ.10 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ ఈ సినిమాలో నటించడంతో.. బాలీవుడ్ లో ‘జిన్నా’పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మేకర్స్ ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకొని, హిందీ రైట్స్ ని 10 కోట్ల భారీ మొత్తానికి అమ్మినట్లు తెలుస్తుంది. ఈ సినిమా రూ.15 కోట్లు ఖర్చు కాగా, హిందీ హక్కులు రూ.10 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక మిగిలిన నాన్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నీ కలిపితే జిన్నాకు భారీ లాభాలు వచ్చినట్లే.