Sunny Leone : బిగ్‌బాస్ వల్లే నేను పోర్న్ ఇండస్ట్రీ వదిలి వచ్చేశాను.. కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లో సన్నీలియోన్ వ్యాఖ్యలు..

తాజాగా సన్నీలియోన్ ఫ్రాన్స్ లో జరిగే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. కాన్స్ లో అక్కడి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పోర్న్ ఇండస్ట్రీ నుంచి సినీ పరిశ్రమకు ఎలా వచ్చిందో మరోసారి తెలిపింది.

Sunny Leone : బిగ్‌బాస్ వల్లే నేను పోర్న్ ఇండస్ట్రీ వదిలి వచ్చేశాను.. కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లో సన్నీలియోన్ వ్యాఖ్యలు..

Sunny Leone interview at Cannes film festival says about her film travelling

Cannes 2023 :  ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇప్పుడు ఇండియాలో(India) నటిగా బిజీ అయింది సన్నీలియోన్(Sunny Leone). పోర్న్ ఇండస్ట్రీ నుండి ఇండియా సినీ పరిశ్రమకు రావాలనుకున్నప్పుడు మొదట్లో తనని బెదిరించారని, భయపెట్టారని గతంలోనే పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ప్రస్తుతం మాత్రం సన్నీలియోన్ వరుస సినిమాలతో బిజీగా అంది. బాలీవుడ్ లోనే కాక తెలుగు, తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. నటిగా సినిమాలు, సిరీస్ లు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. తాజాగా సన్నీలియోన్ ఫ్రాన్స్ లో జరిగే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది.

 

కాన్స్ లో అక్కడి మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పోర్న్ ఇండస్ట్రీ నుంచి సినీ పరిశ్రమకు ఎలా వచ్చిందో మరోసారి తెలిపింది. సన్నీలియోన్ మాట్లాడుతూ.. మొదట నన్ను ఇండియా బిగ్ బాస్(BiggBoss) లో పాల్గొనాలని పిలిచారు. నా భర్తతో మాట్లాడితే ఇండియాలో ఇప్పటికే బెదిరింపులు వచ్చాయి అక్కడ నటిస్తాను అంటే అవసరమా వద్దు అన్నాడు. కానీ ధైర్యం చేసి వచ్చి హిందీ బిగ్‌బాస్ లో పాల్గొన్నాను. కొన్ని వారాల తర్వాత బయటకు వచ్చేశాను. బిగ్‌బాస్ లో పాల్గొనడం వల్ల రోజువారీ పనులు చేసుకుంటూ, కొత్త వాళ్ళతో మాట్లాడుతూ నేను చాలా మారిపోయాను. నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. బిగ్‌బాస్ లో ఏడు వారాలు ఉన్నాను. ప్రతివారం గడిచే కొద్దీ నాకు ఏదో ఒక మంచి జరుగుతుందని, ఇండియాలో సినిమా ఆఫర్స్ వస్తాయని భావించాను. అనుకున్నట్టే హౌస్ లో ఉండగానే నాకు సినిమా ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక నేను పోర్న్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేశాను అని తెలిపింది.

Shruti Haasan : హీరోలకు సమానంగా హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నా..

ఒక రకంగా చెప్పాలంటే ఆ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చి నాకు మంచి చేసింది. దాని వల్లే నేను అందరితో కలిసిపోయాను, ఇండియాలో సినిమాలు చేయగలుగుతున్నాను. మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా కొంతమంది బెదిరించారు. కానీ ఇప్పుడు అంతా సంతోషంగానే ఉన్నాం. కెన్నెడీ సినిమా ద్వారా ఇక్కడ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వరకు రాగలిగాను అని తెలిపింది సన్నీలియోన్. దీంతో సన్నీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.