Sunny Leone: మంచు హీరోలతో సన్నీ.. అప్పుడు మనోజ్, ఇప్పుడు విష్ణు!

సన్నీలియోన్.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఎందుకు పాపులరో.. ఆమె గతం ఏంటో అందరికీ తెలిసిందే. నీలి చిత్రాల ఇండస్ట్రీలలో ఆమె నటి మాత్రమే కాదు.. నిర్మాత కూడా.

Sunny Leone: మంచు హీరోలతో సన్నీ.. అప్పుడు మనోజ్, ఇప్పుడు విష్ణు!

Sunny Leone

Sunny Leone: సన్నీలియోన్.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఎందుకు పాపులరో.. ఆమె గతం ఏంటో అందరికీ తెలిసిందే. నీలి చిత్రాల ఇండస్ట్రీలలో ఆమె నటి మాత్రమే కాదు.. నిర్మాత కూడా. ఆమె ఆ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్. అయితే, అదంతా గతం.. జిస్మ్ 2 సినిమాతో ఆమె బాలీవుడ్ లో అరంగేట్రం చేయడం.. ఇండియాలో సెటిలై ఇండియన్ సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సన్నీ హిందీతో పాటు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తుంది.

Sunny Leone: డ్రెస్ ఏదైనా సన్నీ సృష్టించే హీట్ కామన్!

మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ కరెంట్ తీగ సినిమాతో సన్నీ తెలుగులో డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత గరుడవేగలో కూడా నటించగా ఆ తరువాత బాలీవుడ్ లో బిజీగా మారింది. కాగా ఇప్పుడు మరోసారి తెలుగుకు రీఎంట్రీ ఇస్తుంది. ఈసారి మంచు వారి పెద్దబ్బాయి విష్ణు సినిమాతో సన్నీ రీఎంట్రీ ఇస్తుంది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ సన్నీలియోన్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా స్పష్టం చేసింది. ఈ రోజు మరో జర్నీని మంచు విష్ణుతో కలిసి ప్రారంభించినందుకు చాలా థ్రిల్లింగ్ వుంది` అని తెలిపింది.

Sunny Leone : బన్నీతో స్పెషల్ సాంగ్ కోసం సన్నీ అంత అడిగిందా..!

మోసగాళ్లు సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విష్ణు ఇప్పుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో గాలి నాగేశ్వరావు పాత్రలో విష్ణు కనిపించనుండగా.. విష్ణు క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు సన్నీ స్కెచ్ రిలీజ్ చేయగా ఇందులో సన్నీ రేణుక పాత్రలో కనిపించనుంది. కాగా, ఈ సినిమాకి ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరి సన్నీ-కోన కలిసి విష్ణుకి ఒక సక్సెస్ తెస్తారేమో చూడాలి.