Bigg Boss 5: సన్నీ ఆ హక్కు నీకే ఉంది.. ప్రియా ఎమోషనల్ కామెంట్స్!

ప్రేక్షకులలో నిరాశ బిగ్ బాస్ కి కనిపించిందో.. లేక ఆ రేటింగులు కళ్ళు తెరిపించాయో కానీ ఈ వారం షోలో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచారు. ఒక విధంగా ఇందులో ప్రియా, సన్నీలు సక్సెస్ సాధించారు...

Bigg Boss 5: సన్నీ ఆ హక్కు నీకే ఉంది.. ప్రియా ఎమోషనల్ కామెంట్స్!

Bigg Boss 5 (1)

Bigg Boss 5: ప్రేక్షకులలో నిరాశ బిగ్ బాస్ కి కనిపించిందో.. లేక ఆ రేటింగులు కళ్ళు తెరిపించాయో కానీ ఈ వారం షోలో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచారు. ఒక విధంగా ఇందులో ప్రియా, సన్నీలు సక్సెస్ సాధించారు. ఆవేశం.. అంతకు మించిన కామెడీతో ఇద్దరూ ఈ వారం అదరగొట్టారు. ముందు ఆవేశంతో చెంప పగలగొడతానన్న ప్రియా.. తర్వాత అదే సన్నీకి ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చింది ప్రియా. ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్స్ కు ఫిదా అయ్యారు. కానీ.. అంతలోనే ప్రియాను ఎలిమినేట్ చేసి ఇంట్లో నుండి బయటకి లాక్కొచ్చేశాడు బిగ్ బాస్.

Bigg Boss 5: అనుకున్నదే జరిగింది.. ట్విస్టుల మధ్య ప్రియా ఔట్!

ఎలిమినేషన్‌ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్‌ ఆడించాడు నాగ్‌. హౌస్‌మేట్స్‌కు రిపోర్డ్‌ కార్డ్‌ ఇవ్వమని ఆదేశించగా ఒక్కొక్కరికి ప్రియా మార్కులేసింది. మొదటగా లోబో తనకు అర్థం కాడంటూ ఐదు మార్కులివ్వగా.. విశ్వకు కూడా 5 మార్కులిచ్చింది. బాగా ఆడుతున్నాడంటూ రవికి 7 మార్కులు, షణ్ముఖ్‌కు ఎనిమిదిన్నర మార్కులేసింది. అంతేకాదు.. షణ్ను లాంటి ఫ్రెండ్‌ ప్రతి ఒక్కరికీ ఉండాలని.. షణ్ను వండర్‌ఫుల్‌ పర్సన్‌, అతడు బ్రెయిన్‌తో గేమ్‌ ఆడుతున్నాడని షణ్ముఖ్ ను ఆకాశానికి ఎత్తేసింది.

శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే అసలు ‘మా’ ఉందని తెలిసింది!

సిరికి ఎనిమిదిన్నర మార్కులు ఇచ్చిన ప్రియా.. శ్రీరామ్‌ కు 8 మార్కులు ఇచ్చింది. ఇక తనకు ఎంతగానో క్లోజ్‌ అయిన ప్రియాంకకు పదికి 100 మార్కులు ఇచ్చేసిన ప్రియా.. పొద్దున లేవగానే పింకీని చూస్తానని, తనని చూడకుండా నిద్ర లేచిన రోజు ఏదో ఒక గొడవ జరుగుతుందని చెప్పుకొచ్చింది. ప్రియ వెళ్లిపోతుందని తెలిసినప్పటి నుండే గాబరా చెందిన పింకీ గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. ఇక ప్రియా తన గురించి మాట్లాడుతుంటే పింకీ రోదిస్తూనే ఉండగా ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.

Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్ అన్నందుకు సన్నీకి ముద్దులిచ్చిన ప్రియా

ఇక చివరిగా సన్నీకి 9 మార్కులేసిన ప్రియా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ లో గేమ్ లో భాగంగా ఎన్నో అనుకుంటాం.. అవన్నీ ఆ క్షణంలోనే వదిలేయాలి. ఇప్పుడు నా ప్లేట్ లో తినే హక్కు నీకు ఉంది. నా కప్పులో టీ తాగే హక్కు నీకు ఉంది. నిజానికి ఈ వారం మరింత దగ్గర అవ్వాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఎలిమినేట్ కావాల్సి వస్తుందని ప్రియా సన్నీ గురించి ఎమోషనల్ అయింది. దీంతో సన్నీ కూడా కాస్త ఫీల్ లోకి వెళ్ళాడు. మొత్తానికి అలా అలా ప్రియా ఇంటిని వీడి తన ఇంటికి చేరుకుంది.