Niharika Konidela: సన్‌సెట్ విత్ చార్లీ.. నిహారికా సందడి మామూలుగా లేదుగా!

మెగా డాటర్ నిహారికా కొణిదెల పెళ్లి తరువాత రియాలిటీ షోలు, సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఆమె మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం....

Niharika Konidela: సన్‌సెట్ విత్ చార్లీ.. నిహారికా సందడి మామూలుగా లేదుగా!

Sunset With Charlie Ft Niharika Impressive

Niharika Konidela: మెగా డాటర్ నిహారికా కొణిదెల పెళ్లి తరువాత రియాలిటీ షోలు, సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఆమె మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ‘777 చార్లీ’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో, తెలుగులోనూ ఈ సినిమాపై క్రేజ్ ను క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

Niharika Konidela: ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇన్‌స్టాలోకి మెగా డాటర్ రీ ఎంట్రీ!

ఈ క్రమంలోనే 777 చార్లీ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూని మెగా డాటర్ నిహారికా హోస్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. చాలా రోజుల తరువాత నిహారికాను ఇంత చలాకీగా చూడటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ ఇంటర్వ్యూను హోస్ట్ చేస్తుండగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా ఈ ఇంటర్వ్యూలో మనకు కనిపించబోతున్నాడు.

Niharika Konidela : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నిహారిక.. కారణం ఏంటి??

కన్నడ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా వస్తున్న ‘777 చార్లీ’ చిత్రం ఓ కుక్క చుట్టూ కథ తిరుగుతుండటంతో ఈ సినిమాపై కన్నడ వర్గాలతో పాటు ఇతర భాషల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. కాగా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం నిహారికా చేసిన ఈ ఇంటర్వ్యూను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆృతతగా చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Suresh Productions (@sureshproductions)