మజిలీ సినిమాకి సూపర్ రెస్పాన్స్

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 05:33 AM IST
మజిలీ సినిమాకి సూపర్ రెస్పాన్స్

ఒక్క హిట్టు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాడు అక్కినేని హీరో. యాక్షన్ అండ్ ఫ్యామిలీ మూవీస్ తో రకరకాల ప్రయోగాలు చేసిన కానీ లక్కు కలిసిరాలేదు. అందుకే ఈసారి తన అదృష్ట దేవతని నమ్ముకున్నాడు. ఎట్టకేలకు చివరికి హిట్టు కొట్టేశాడు. మరి ఆ హీరో ఆ అదృష్ట దేవత ఎవరు..? 

నాగచైతన్య, సమంతా జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మజిలీ మూవీలో చైతూ, స్యామ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రతిఒక్కరూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్ ఇలా అన్నిరకాల ఎలిమెంట్స్ తో మజిలీ ఈ ఉగాదికి తెలుగు ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తోంది.

చాలా కాలంగా హిట్టు సినిమా లేక డీలాపడిపోయిన నాగచైతన్య మజిలీతో ఫామ్ లోకి వచ్చాడు. 2017 మేలో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత చైతూకి ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. యుద్దం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి ఇలా వరుసగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ మూవీస్ చేసినా అన్నీ ప్లాపే అయ్యాయి. 

చివరికి తనకి బాగా అచ్చొచ్చిన లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకుని నాగచైతన్య హిట్టు కొట్టాడు. అంతేకాదు మజిలీతో నాగ చైతన్యకి సమంతా లక్కీ గర్ల్ అని మరోసారి నిరూపించుకుంది. ఛైతన్యని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే మజిలీలో సమంతా హీరోయిన్ గా నటిస్తోందని అనౌన్స్ మెంట్ రాగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తో హైప్ క్రియేట్ అయ్యింది.