మహేష్ ఫ్యామిలీ డే అవుట్ – వైరల్ అవుతున్న పిక్స్

అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్.. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు..

  • Published By: sekhar ,Published On : January 30, 2020 / 09:29 AM IST
మహేష్ ఫ్యామిలీ డే అవుట్ – వైరల్ అవుతున్న పిక్స్

అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్.. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు..

‘భరత్ అనే నేను’, ‘మహర్షి, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పుడు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు. ఇక తన సినిమా కెరీర్ మొత్తంలో సరిలేరు సినిమాని ఎంచుకోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయం అని, ఇటీవల ఆ సినిమా సక్సెస్ మీట్‌లో మహేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే.

Image

ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్, నేడు తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో తమ ఫ్యామిలీతో కలిసి దిగిన గ్రూప్ ఫోటోని పోస్ట్ చేసారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి దిగిన ఫోటోని మహేష్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోని సూపర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్స్, లైక్స్ చేస్తూ దానిని మరింతగా వైరల్ చేస్తున్నారు..

Read Also : హాలిడే ఎలా ఎంజాయ్ చేయాలో ఇలియానాను చూసి నేర్చుకోవాల్సిందే!

Image

అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత ఎప్పటికప్పుడు తమ వెకేషన్ పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే మహేష్ మోకాలి ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారని, రెండు నెలలపాటు అక్కడే విశ్రాంతి తీసుకుని.. మే నెల నుండి వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

MAHESH