ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా ఓకే చేశా: మహేశ్ బాబు

ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా ఓకే చేశా: మహేశ్ బాబు

వరంగల్ వేదికగా ఏర్పాటు చేసిన సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ జోష్ ఫుల్ గా జరిగింది. మహేశ్ బాబు, రష్మిక మంధాన, విజయ శాంతి, అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్‌లంతా ప్రోగ్రాంకు వచ్చి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఏ స్టేజి మీదైనా తక్కువగా మాట్లాడే మహేశ్ బాబు.. డైలాగులు చెప్పి అదరగొట్టాడు. సినిమా యూనిట్లో ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ అభిమానుల కోసమే సినిమా స్క్రిప్ట్ ఓకే చేశానని చెప్పాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 

=> అందరికీ నమస్కారం.

=> అనిల్ రావిపూడి రాసిన అన్ని డైలాగ్ లలో రమణ డైలాగే బాగా పేలింది.
=> ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. 
=> ఉదయాన్నే ఎంటైర్ టీంతో స్వామివారి దర్శనం చేసుకున్నాం.  సాయంత్రం మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ. 
=> డిస్ట్రిబ్యూటర్, టెక్నిషియన్స్, ఫైట్ మాస్టర్, రత్నవేల్, దేవీ శ్రీ ప్రసాద్ కు స్పెషల్ థ్యాంక్స్. 
=> శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి వచ్చిన రెస్పాన్స్ ను కలలో కూడా ఊహించలేదు.
=> విజయశాంతి గారితో కొడుకు దిద్దిన కాపురం, 13ఏళ్ల తర్వాత ఆవిడతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. 
=> ఫస్ట్ డే షూటింగ్ కలిసినప్పుడు 13ఏళ్ల తర్వాత అయినా నిన్నే కలిసినట్లు అనిపించింది.
=> రష్మిక స్వీటెస్ట్ కో స్టార్. 
=> రాజేంద్ర ప్రసాద్ నేనున్న ప్రతిరోజూ ఆయన వచ్చారు. 
=> ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, సీతమ్మ వాకిట్లో, మహర్షి మీరంటే నాకు చాలా ఇష్టం. 
=> మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఈసినిమా స్క్రిప్ట్‌కు ఓకే చెప్పాను. 
=> థ్యాంక్యూ అనిల్ రావిపూడి గారు అభిమానుల కోరిక తీర్చారు. 
=> స్టేజి మీద ఎప్పుడూ డైలాగ్ లు చెప్పను. 
=> బ్లాక్ బాస్టర్ సినిమానే కాదు.. స్పీచ్. మీ ప్రేమకు, మీ అప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఏ బౌ.
=> అనిల్ రావిపూడి గారికి స్పెషల్ థ్యాంక్స్. మంచి సినిమా తీశారు.

వారంలో వంద కోట్లు వసూలు చేసిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.