మహిళలు మహా శక్తివంతులు.. మహేష్ బాబు ‘వుమెన్స్ డే’ ట్వీట్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..

  • Published By: sekhar ,Published On : March 8, 2020 / 06:27 AM IST
మహిళలు మహా శక్తివంతులు.. మహేష్ బాబు ‘వుమెన్స్ డే’ ట్వీట్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మ ఇందిర, భార్య నమ్రత, కూతురు సితార పాప ముగ్గురూ పక్కపక్కన ఉన్న ఫోటో షేర్ చేస్తూ..

‘ఈ ముగ్గురు మహిళలు నా ఉనికికి నిర్వచనం.. వారికి, అందరు మహిళలకు మరింత బలం చేకూరాలి.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు సూపర్ స్టార్.

 

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ త్వరలో  మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు. ఈ మూవీలో మహేష్ స్టూడెంట్ లీడర్ పాత్ర చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే 30 రోజులు డేట్స్ ఇచ్చాడని టాక్. వంశీ పైడిపల్లి, పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలోనూ మహేష్ సినిమాలు చేయనున్నాడు.  

See Also | జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. నేను దిగితే ఢీ కొట్టేదెవరు..