బాషా 2 రేంజ్‌లో దర్బార్ చిత్రీకరణ

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 10:31 AM IST
బాషా 2 రేంజ్‌లో దర్బార్ చిత్రీకరణ

సూపర్ స్టార్ రజినీకాంత్ బాషా మూవీ అయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో రజినీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అందుకే  భాషా రిలీజై 22 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ డైరెక్టర్లు రజినీకాంత్ ని ఆడియన్స్ కి భాషాలా చూపించేందుకు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మురుగదాస్, రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతోన్న దర్బార్ సినిమాలో కూడా రజినీ లుక్ అచ్చం భాషా సినిమాలో రజినీని గుర్తుకు తెస్తోంది. దర్బార్ షూటింగ్ స్పాట్ నుంచి లీకైన సూపర్ స్టార్ ఫోటోలు ఆన్ లైన్లో వైరల్ అవుతున్నాయి.

రజినీకాంత్ వయసు ఇప్పుడు 68 ఏళ్లు. అయినాసరే లుక్ స్టైల్ పరంగా రజినీ 22 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ డైరెక్టర్సే తమ సినిమాల్లో రజినీ లుక్ ని భాషాలా తీర్చిదిద్దుతున్నా క్యారెక్టర్ ని మాత్రం అంత పవర్ ఫుల్ గా చూపించలేకపోతున్నారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన పెటా సినిమా రిలీజ్ కి ముందు భాషా 2 అనే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. కానీ చివరికి ఆడియన్స్ పెటా సినిమాని భాషాతో అస్సలు పోల్చుకోలేకపోయారు.

కబాలి, కాలా సినిమాల్లో కూడా రజినీకాంత్ డాన్ క్యారెక్టర్స్ లో నటించారు. అప్పట్లో కూడా మరో భాషా అనే ప్రచారం జరిగింది. కానీ కబాలి, కాలా సినిమాలు కూడా భాషాని టచ్ చేయలేక పోయాయి. భాషా గెటప్ లో రజినీ ఇప్పటికీ కరెక్ట్ గా సూటవుతున్నా అలాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీయడంలోనే డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు.