సూపర్ స్టార్ స్టామినా.. ఫ్రాన్స్‌లో ‘దర్బార్’ రీ-రిలీజ్

  • Published By: sekhar ,Published On : July 1, 2020 / 04:59 PM IST
సూపర్ స్టార్ స్టామినా.. ఫ్రాన్స్‌లో ‘దర్బార్’ రీ-రిలీజ్

‌కరోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న గ‌త మూడు నెల‌లుగా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వీటితో పాటు షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేటర్స్ ఎప్పుడు తెర‌చుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి నెలకొంది. అయితే విదేశాల‌లో మాత్రం సినిమా హాళ్లు ఓపెన్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌న సినిమాల‌ని కూడా విదేశాల‌లో రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూస్’ సినిమాను దుబాయ్‌లో రిలీజ్ చేశారు. అదే బాటలో ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా థియేటర్లను ఓపెన్ చేయనున్నాను. తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ చిత్రంతో ఇటీవలే అక్కడ థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి.

Rajini

అయితే ఇప్పుడు రిలీజ్‌ చేయడానికి కొత్త సినిమాలేవీ లేక‌పోవ‌డంతో పాత సినిమాల‌నే రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘ద‌ర్బార్‌’ను బుధ‌వారం(జూలై 1) నుండి ఫ్రాన్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. రజినీకాంత్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అక్కడ విడుద‌ల చేశారు.

Read:స్టార్ హీరో అభిమానులపై కేసు పెట్టిన తరుణ్ భాస్కర్