Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

సూపర్ స్టార్ మహేష్.. వయసు పెరిగే కొద్దీ అందం ఇంకా పెరుగుతుందేమో అనిపించేలా 46 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు అందనంత ఎత్తులో ట్రెండ్ కొనసాగిస్తూనే ఉన్నాడు.

Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్.. వయసు పెరిగే కొద్దీ అందం ఇంకా పెరుగుతుందేమో అనిపించేలా 46 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు అందనంత ఎత్తులో ట్రెండ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. తాపీగా సినిమాలు చేసుకుంటూ.. సెలక్టివ్ సినిమాలతో ఇమేజ్ పెంచుకుంటూ పోతూనే ఉన్న మహేష్ వ్యాపార ప్రకటనలో కూడా గట్టిగానే వెనకేసుకుంటున్నాడు. ఇవే కాదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని.. సినిమాలు, బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూనే మరోవైపు వ్యాపారం రంగంలో కూడా తిరుగులేని స్టార్ గా మారిపోయాడు.

Mannara Chopra: ఈ పోజు ఏంటో.. చీరకట్టులోనూ ఇంత హాటా!

హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్ ఉండగానే ది హంబుల్ అనే డిజైనర్ వేర్ ద్వారా మహేష్ ముందుగా టెక్సటైల్ బిజినెస్ లోకి దిగిపోయాడు. ఆ తర్వాత ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట థియేటర్స్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటరయ్యాడు. దీంతో పాటు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసిన మహేష్.. తాను నటించే ప్రతి సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామి అవుతున్నాడు. తానే కాకుండా ఇతర హీరోలతో కూడా ఈ హౌస్ నుండి సినిమాలను నిర్మిస్తున్నాడు.

Mega Hero’s: మెగా నామ సంవత్సరంగా 2022.. ఫ్యాన్స్‌కు పండగే!

వీటితో పాటు మహేష్ ఇప్పుడు మరో వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట. కరోనా తర్వాత ఆన్ లైన్ క్లాసులకు ఫుల్ డిమాండ్ గా మారిన సంగతి తెలిసిందే. స్కూల్స్, కాలేజెస్ మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఈ ఆన్ లైన్ క్లాసుల కోసం కొన్ని యాప్స్ కూడా వచ్చేశాయి. ఇందులో మహేష్ ఇప్పటికే బైజూస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. కాగా.. ఇప్పుడు తానే సొంతంగా ఇలాంటి వ్యాపారాన్ని మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడట. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే విధంగా ఈ ఎడ్యుకేషనల్ యాప్ ను డిజైన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.