మనం ఇంట్లో ఉంటే వాళ్లు మనకోసం.. బాధ్యత ఉండాలి..

ప్రజలందరికోసం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

  • Published By: sekhar ,Published On : April 16, 2020 / 09:27 AM IST
మనం ఇంట్లో ఉంటే వాళ్లు మనకోసం.. బాధ్యత ఉండాలి..

ప్రజలందరికోసం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో మన దేశ ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తూ, మొన్న ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన ప్రధాని నరేంద్ర మోడీ, దానిని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైరస్ ప్రభలకుండా ఉండడానికి ప్రజల మధ్య సామజిక దూరం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. కాగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, శానిటరీ సిబ్బంది మనకోసం ఎంతో శ్రమపడుతుండగా, పలువురు ప్రజలు, ప్రముఖులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘ఇటువంటి విపత్కర సమయంలో మన కోసం, మన ఆరోగ్య రక్షణ కోసం, తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి మన చుట్టుప్రక్కల ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఎంతో గొప్ప మనసుతో మనకు రక్షణ కల్పిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చేతులు జోడించి ప్రత్యేకంగా వందనం చేస్తున్నానని, మనమందరం ఇళ్లల్లో ఉంటే వారంతా మనకోసం కష్టపడుతున్నారు.

Read Also : లాక్‌డౌన్ వేళ మెగా తండ్రీ కొడుకులు ఏం చేస్తున్నారో చూశారా!

వారికి మన అందరి ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూన్నాను’ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన మహేష్ నేడు పారిశుద్ధ్య కార్మికులకు వందనం చెపుతూ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.