Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మాస్ ట్రీట్.. మరికొన్ని గంటలే టైమ్! Superstar Mass Treat with Sarkaru Vaari Paata.. Just a few more hours Time!

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మాస్ ట్రీట్.. మరికొన్ని గంటలే టైమ్!

ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అతడే మహేశ్ బాబు.. ఇప్పుడు మైండ్ బ్లాక్ చేసే హిట్ కొట్టడానికి మాస్ ట్రీట్ తో రెడీ అయ్యాడు..

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మాస్ ట్రీట్.. మరికొన్ని గంటలే టైమ్!

Sarkaru Vaari Paata: ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అతడే మహేశ్ బాబు.. ఇప్పుడు మైండ్ బ్లాక్ చేసే హిట్ కొట్టడానికి మాస్ ట్రీట్ తో రెడీ అయ్యాడు.. మునుపెన్నడూ చూడని యాంగిల్ లో మహేశ్ ను మలిచాడు డైరెక్టర్ పరుశురామ్.. మాటల్లో మాస్, పాటల్లో మాస్, గెటప్ లో మాస్.. టైటిలే మాస్.. సర్కార్ వారి పాట. పోకిరి, బిజినెస్ మెన్, దూకుడు, ఖలేజా కలిపితే ఎంత కిక్ ఉంటుందో అంత కిక్ ఇవ్వడానికి వస్తోన్న మహేశ్ బాబు సర్కార్ వారి పాట మాస్ యాంగిల్ పై ఓ లుక్కేద్దాం.

Sarkaru Vaari Paata: పంచులతో పిచ్చెక్కించనున్న మహేష్!

మే 12.. సర్కారు వారి పాట రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరికొన్ని గంటలలోనే తెరపై బొమ్మ పడిపోతుంది. ఇప్పటికే సర్కార్ వారి పాట మీద ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశారు టీమ్.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ మహేశ్ ఒరిజినల్ నేమ్ తోనే మాస్ క్యారెక్టర్ డిజైన్ చేశారు పరుశురామ్.. డైరెక్ట్ గా రంగంలోకి దిగిన మహేశ్ బాబు ఇంటర్వూలో తెరవెనుక జరిగిన సంగతులు, తెరమీద వర్కవుట్ అయిన మ్యాజిక్ లు షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ ను ఇప్పటికే ఫుల్ ఖుషీ చేసేశారు. మే 12న పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని, దానికోసం వర్రీ అవసరం లేదని, రిలీక్స్ అయిపోయినట్టు చెప్పుకొచ్చారు సూపర్ స్టార్.

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మరో స్పెషల్.. ఆసక్తి రేపుతున్న థమన్ ట్వీట్!

మాంచి ఆకలి మీదున్న మహేశ్ ఫ్యాన్స్ కి మాస్ మసాలా ట్రైలర్ తో ఇప్పటికే ఫుల్ మీల్స్ రుచి చూపించారు పరుశురామ్. ఇంకేముంది సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఇక ముందుంది మాస్ జాతర అన్న కాన్ఫిడెన్స్ ను కలిగించారు. ట్రయిలర్ తోనే పోకిరి, ఖలేజా, దూకుడుని మిక్స్ చేస్తే వచ్చే మాటలతో మాస్ కిక్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మమమమ మహేశా సాంగ్ తో మాస్ ఆడియన్స్ ను ఉర్రూత లూగిస్తున్నాడు సూపర్ స్టార్. అంతకు ముందు మైండ్ బ్లాక్ సాంగ్ తో మాస్ స్టెప్పులేసిన మహేశ్, సర్కార్ వారి పాటలో మరో సారి తన మాసివ్ పవర్ చూపించారు. తమన్ మాస్ బీట్స్ కు మహేశ్ ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

Sarkaru Vaari Paata: మాసివ్ హిట్ టార్గెట్‌గా ఎస్‌వీపీ.. బాక్సాఫీస్ బద్దలే!

మహానటిని మార్చేశారు.. సాఫ్ట్ గా ఉండే కీర్తి సురేష్ లో మాస్ యాంగిల్ ను బయటకు తీశారు.. మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ పైన సందేహించిన ఫ్యాన్సే ట్రయిలర్, సాంగ్స్ చూశాక, కీర్తి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కడం పక్కా అంటున్నారు. ఒక డైరెక్టర్ గానే కాకుండా మహేశ్ బాబు అభిమానిగా పరుశురామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.. తమ హీరోను ఎలా అయితే చూసుకుని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారో అలా రెడీ చేశారు. ఓవర్సీస్ లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా మే 11న రిలీజ్ అవుతుండగా.. ఇక్కడ మే 12న రిలీజ్ కాబోతుంది. తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్ రేట్స్ హైక్ చేసుకునే అనుమతి వచ్చింది. ఇక పోకిరి రేంజ్ లో సర్కార్ వారి పాట ఆల్ టైమ్ హిస్టరీ రికార్డ్స్ బద్ధలు కొట్టడం ఖాయం అని ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్.

×