Publish Date - 2:29 am, Tue, 17 December 19
By
vamsiసూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడులో తలైవా అని పిలుచుకుంటారు.. అభిమానులకు ఆయనొక దేవుడు. గుడులు కట్టి పూజించుకుంటారు. ప్రస్తుతం దర్భార్ అనే సినిమా చేస్తున్నాడు తలైవా. అభిమానులను తరచూ కలిసేందుకు ఇష్టపడే తలైవా రజినీకాంత్.. లేటెస్ట్‌గా గర్భిణిగా ఉన్న తన అభిమానిని కలిశాడు. అంతేకాదు ఆమెకు తండ్రిగా గాజులు తొడిగా ఆమె కోరికను తీర్చారు. దీనికి సంబంధించి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన విజ్ఞేష్ కుటుంబానికి సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే చాలా ఇష్టం. విజ్ఞేష్ భార్య జగదీశ్వరి ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఆమెకు రజినీకాంత్‌ని కలిసి ఆయన ఆశీర్వాదం పొందాలని కోరిక. ఆ కోరిక తీర్చేందుకు భర్త విజ్ఞేష్ చాలా ట్రై చేశాడు. తెలిసిన వ్యక్తుల ద్వారా రజినీకాంత్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాడు. చివరకు దర్బార్ షూట్ చివరి రోజు అపాయింట్‌మెంట్ దక్కింది.
దీంతో భార్యతో కలిసి రజినీకాంత్‌ని కలుసుకునేందుకు వెళ్లిన విజ్ఞేష్ దంపతులను రజినీకాంత్ ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. గర్భవతిగా ఉన్న అతని భార్యను తండ్రిగా ఆశీర్వదించి తండ్రిగా గాజులు తొడిగాడు. కొద్దిరోజుల క్రితం కేరళ యువకుడు ప్రణవ్‌ను కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశాడు. రెండు చేతులు లేని అతనిని కలిసిన సూపర్ స్టార్ అతని చిరకాల కోరికను నెరవేర్చాడు.
Man Killed : లిఫ్ట్ అడిగిన వ్యక్తి పెట్రోల్ కు డబ్బులు ఇవ్వలేదని హత్య
Congress candidate dies : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కరోనాతో మృతి
Veerappan Daughter : వీరప్పన్ ఉండే అడవుల్లో భారీగా నిధుల డంప్
Idli Amma: రూపాయి ఇడ్లీ అమ్మకు ఆనంద్ మహీంద్రా అందమైన గిఫ్ట్
డీఎంకే నేత ఏ.రాజాకి ఈసీ షాక్..ప్రచారంపై నిషేధం
MNM symbol torchlight : కమల్ హాసన్ కు కోపమొచ్చింది. టార్చ్ లైట్ విసిరికొట్టారు