‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో ‘తలైవా’ 168

సూపర్ స్టార్’ రజినీకాంత్ తన తర్వాతి సినిమాను ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో చెయ్యనున్నారు.. రజినీ నటించబోయే 168వ సినిమా ఇది..

10TV Telugu News

సూపర్ స్టార్’ రజినీకాంత్ తన తర్వాతి సినిమాను ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో చెయ్యనున్నారు.. రజినీ నటించబోయే 168వ సినిమా ఇది..

‘సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా, ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తర్వాత రజినీ, ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సినిమా చెయ్యనున్నారు.

తెలుగులో సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారి.. ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ సినిమాలు చేసిన శివ తమిళ్‌లో కార్తితో ‘సిరుత్తై’ (విక్రమార్కుడు) రీమేక్ చేశాడు. ‘అల్టిమేట్ స్టార్’ అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి వరుస హిట్స్‌ కొట్టి కోలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

Read Also : సరిగ్గా సంవత్సరం క్రితం వీర రాఘవుడి వేట మొదలైంది

రజినీ ఇమేజ్‌కి తగిన కథ చెప్పడంతో ‘తలైవా’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. రజినీ నటించబోయే 168వ సినిమా ఇది. ‘రోబో’, ‘పేటా’ సినిమాల తర్వాత సన్ పిక్చర్స్ సంస్థ రజినీతో నిర్మిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ మూవీ ప్రారంభం కానుంది. ‘దర్బార్’ 2020 సంక్రాంతికి విడుదల కానుంది..