Sarkaru Vaari Paata: సూపర్ కాన్ఫిడెన్స్‌తో సూపర్ స్టార్.. రికార్డ్సే టార్గెట్!

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా.. ఇప్పడు ఇదీ సర్కార్ వారి పాటపై సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాన్ఫిడెన్స్ లెవల్. కరోనాతో లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి, బిగ్ సక్సెస్ కొట్టడం ఖాయం అంటున్నారు.

Sarkaru Vaari Paata: సూపర్ కాన్ఫిడెన్స్‌తో సూపర్ స్టార్.. రికార్డ్సే టార్గెట్!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా.. ఇప్పడు ఇదీ సర్కార్ వారి పాటపై సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాన్ఫిడెన్స్ లెవల్. కరోనాతో లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి, బిగ్ సక్సెస్ కొట్టడం ఖాయం అంటున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి తన సినీజర్నీ అంతా హాపీగా ఉందంటున్నాడు మహే. బాలీవుడ్ ఎంట్రీ పైనా మరోసారి బ్లాస్ట్ అయ్యాడు సూపర్ స్టార్.. ఒక పక్కా సర్కార్ వారి పాట సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్.. మరో పక్క తన సినీ కెరీర్ మీద ఫుల్ క్లారిటీతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేస్తున్నాడు.

Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

మే 12న సర్కారు వారి పాట రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కౌంట్ డౌన్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకుంది. ఇప్పటికే సరికొత్త పంథాలో ప్రమోషన్స్ చేశారు టీమ్.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ మహేశ్ ఒరిజినల్ నేమ్ తోనే క్యారెక్టర్ డిజైన్ చేశారు పరుశురామ్.. మమమమ మహేశా సాంగ్ తో మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు సూపర్ స్టార్.. ముందుంది మాస్ జాతర అన్న కాన్ఫిడెన్స్ ను ఫ్యాన్స్ కు కలిగించారు. మహేశ్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఈ సినిమా ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లారు. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని రిలీజ్ కు ముందే చెప్పేస్తూ రిజల్ట్ పై సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. లీకు రాయుళ్ల పుణ్యమే!

సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నారు. మాంచి ఆకలి మీదున్న మహేశ్ ఫ్యాన్స్ కి మాస్ మసాలా ట్రైలర్ తో ఇప్పటికే ఫుల్ మీల్స్ రుచి చూపించారు పరుశురామ్. ఇక ఈ సినిమాలో అయితే తన అభిమాన స్టార్ హీరో ఏజ్ మరింత తగ్గిందా అన్నట్టు చూపించి, ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. సూపర్ స్టార్.. పర్సనాలిటీ బాలీవుడ్ కే కాదు, హాలీవుడ్ కూ సరిపోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటుంటే మహేశ్ బాబు మాత్రం తనకు స్టార్డమ్ ఇచ్చిన టాలీవుడ్ ను వదిలి ఎక్కడికీ పోయేదే లేదని మరోసారి బల్లా గుద్ధి చెప్పేశారు.

Sarkaru Vaari Paata: మాసివ్ హిట్ టార్గెట్‌గా ఎస్‌వీపీ.. బాక్సాఫీస్ బద్దలే!

ఒకపక్క సర్కార్ వారి పాట.. మరో పక్క మేజర్ ఒక సినిమా స్టార్ గా మరో సినిమాకు ప్రొడ్యూసర్ గా 10 డేస్ గ్యాప్ లోనే ఆడియన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు ప్రిన్స్.. గత నాలుగు సంవత్సరాలనుంచి తాను ముట్టుకున్నది బంగారమవుతుందన్నంత లెవల్ లో కాన్ఫిడెన్స్ ను చూపిస్తున్నారు సూపర్ స్టార్.. సర్కార్ వారి పాటతో పాటు మేజర్ బ్లాక్ బస్టరే అని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సర్కార్ వారి పాట సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ అటు క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రయిలర్ లో ఆయన పలికిన డైలాగ్స్ హైలైటయ్యాయి. ఆల్ ఎమోషన్స్ ను మిక్స్ చేసిన ట్రైలర్ మోస్ట్ వ్యూయ్డ్ టాలీవుడ్ ట్రైలర్ గా నంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది.

Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

మే 11న ఓవర్సీస్ లో 12న ఇండియా వైడ్ మహేశ్ బాబు కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో అవుతున్నాయి. సర్కార్ వారి పాట సినిమాకు తెలంగాణ గవర్నమెంట్ వారం రోజుల పాటు టికెట్ రేట్స్ హైక్ చేసుకునే ఛాన్సిచ్చింది. ఇక పోకిరి రేంజ్ లో సర్కార్ వారి పాట ఆల్ టైమ్ హిస్టరీ రికార్డ్స్ బద్ధలు కొట్టడం ఖాయం అని ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు మహేశ్ ఫ్యాన్స్.