NV Ramana : మంచి తెలుగు సినిమాలు రావట్లేదు.. తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలు..

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ తెలుగు సినిమాపై వ్యాఖ్యలు చేశారు. NV రమణ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం వచ్చే తెలుగు సినిమాలు కేవలం కొంత కాలం మాత్రమే.............

NV Ramana : మంచి తెలుగు సినిమాలు రావట్లేదు.. తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలు..

Cj Nv Ramana

NV Ramana :  గత కొద్ది కాలంగా తెలుగు సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి, భారీ కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా ఘన విజయం సాధిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ గర్వపడుతున్నారు. తెలుగు సినిమాలపై దేశమంతటా ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో గొప్ప సినిమాలు వస్తున్నాయని అంతా అంటున్నారు. ఒకపక్కన తెలుగు సినిమాలని పొగుడుతున్న వేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Movie Tickets : తెలంగాణాలో పెరుగుతున్న సినిమా టికెట్ రేట్లు.. CS సోమేశ్‌కుమార్‌కి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త..

ఇటీవల ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు రాసిన పుస్తకం ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ లాంచింగ్ జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ తెలుగు సినిమాపై వ్యాఖ్యలు చేశారు. NV రమణ మాట్లాడుతూ.. ”ప్రస్తుతం వచ్చే తెలుగు సినిమాలు కేవలం కొంత కాలం మాత్రమే వినోదం ఇచ్చేలా ఉన్నాయి. గతంలో వచ్చే సినిమాల్ల్లాగా చిరకాలం గుర్తుండిపోయే మంచి సినిమాలు రావట్లేదు. ఇప్పుడు తెలుగు సినిమాల పరిస్థితి వాటి సబ్ టైటిల్స్ చూసి డైలాగ్స్ అర్ధం చేసుకొనే విధంగా మారింది. అలాంటి దయనీయ పరిస్థితికి తెలుగు సినిమాని తీసుకురావద్దు” అని అన్నారు. ఒకపక్క తెలుగు సినిమా గ్రేట్ అంటూ మాట్లాడుకుంటున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.