సినిమా ఆపుతారా : మమత సర్కార్‌కు రూ. 20 లక్షల ఫైన్

సినిమా ఆపడంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జరిమాన విధించింది సుప్రీంకోర్టు. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని..

  • Published By: madhu ,Published On : April 12, 2019 / 02:40 AM IST
సినిమా ఆపుతారా : మమత సర్కార్‌కు రూ. 20 లక్షల ఫైన్

సినిమా ఆపడంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జరిమాన విధించింది సుప్రీంకోర్టు. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని..

సినిమా ఆపడంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జరిమాన విధించింది సుప్రీంకోర్టు. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని.. సినిమా స్ర్కీనింగ్‌ని ఆపినందుకు ప్రభుత్వం రూ. 20 లక్షలు కట్టాలని ఆదేశాల్లో వెల్లడించింది. ఈ డబ్బును సినిమాను నిర్మించిన నిర్మాతలకు, థియేటర్ యజమానులకు ఇవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో చిత్ర దర్శక, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత సినిమాను ఎందుకు ఆపాలని చూశారో అర్థం కావడం లేదని దర్శకుడు తెలిపారు. 
Read Also : APలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ?

అనిత్ దత్తా దర్శకత్వం వహించిన సినిమా ‘భోబిష్యోటర్ భూత్’. ఇది పొలిటికల్ సెటైర్ చిత్రం. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. సినిమాను ఇలాగే ప్రదర్శిస్తే దుమారం రేగుతుందతీ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం భావించింది. వెంటనే స్క్రీనింగ్‌ని ఆపివేసింది. సినిమా నిలుపుదలపై దర్శకుడు అనిత్ సుప్రీంకోర్టు మెట్లునెక్కారు. దీనిపై ఏప్రిల్ 11వ తేదీ గురువారం విచారించింది. 

సినిమాను ఆపడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. భావవ్యక్తీకరణ విషయంలో ప్రజలకు స్వేచ్చ కలిగించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంటుందని తెలిపింది. ఇందుకుగాను రూ. 20 లక్షలు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు సినీ వర్గాల నుండి పూర్తి మద్దతు లభించిందని, జరిమాన విధించిన విషయం తనకు ఇంకా తెలియదని దర్శకుడు అనిక్ దత్తా తెలిపారు. 
Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్