అంత ఆరాటమెందుకు : లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతకు సుప్రీం అక్షింతలు

10TV Telugu News

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై నిర్మాత రాకేష్ రెడ్డికి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ఎందుకు అంత ఆరాటపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ఇదేమైనా పెద్ద సమస్యా.. దీనిపై అత్యవసరం విచారణ జరపాల్సిన అవసరం ఏంటీ అంటూ సున్నితంగా మందలించింది న్యాయస్థానం.

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు బ్రేక్ వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ నిర్మాత. అత్యవసర పిటీషన్ దాఖలపై విచారణ సందర్భంగా ఈ విధంగా వ్యాఖ్యానించారు న్యాయమూర్తులు

అత్యవసర విచారణ చేపట్టేందుకే నిరాకరించింది సుప్రీంకోర్టు. పిటీషన్ తిరస్కరించారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఎందుకు ఆగలేకపోతున్నారంటూ ప్రశ్నించింది. 3వ తేదీ విచారణ తర్వాత.. హైకోర్టు నిర్ణయం వెల్లడించిన తర్వాత.. అప్పుడే విచారణ చేపడదాం అని.. మీకు అక్కడి కోర్టులో వ్యతిరేకంగా నిర్ణయం వస్తే.. అప్పుడు మళ్లీ ఆశ్రయించాలని సూచించింది సుప్రీంకోర్టు.

×