The Kerala Story : కేరళ స్టోరీ చిత్రయూనిట్ కి సుప్రీం కోర్టు ఆదేశం.. సినిమా ముందు ఆ నోటిస్ వెయ్యాల్సిందే..

ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేయగా కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు.

The Kerala Story : కేరళ స్టోరీ చిత్రయూనిట్ కి సుప్రీం కోర్టు ఆదేశం.. సినిమా ముందు ఆ నోటిస్ వెయ్యాల్సిందే..

Supreme Court issue orders to The Kerala Story Movie Unit

Supreme Court : ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ కు ముందు నుంచే వార్తల్లో నిలుస్తూనే ఉంది. కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో, రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాము అని చెప్తూ తీసిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించగా సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు.

ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేయగా కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు. అయితే ది కేరళ స్టోరీ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించి ఇప్పటికే 175 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Virupaksha : సూపర్ హిట్ విరూపాక్ష.. ఓటీటీలో నేటి నుంచే.. ఎందులో తెలుసా?

ఈ సినిమాను ఆపడానికి పలువురు కోర్టుల వరకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు కేరళ స్టోరీ చిత్ర యూనిట్ కు ఆదేశాలు జారీ చేసింది. ది కేరళ స్టోరి చిత్ర ప్రదర్శనకు ముందు ఇది సృజనాత్మక సృష్టి అని, కల్పిత కథ అని ఖచ్చితంగా డిస్‌క్లయిమర్‌ ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిత్ర ప్రదర్శనలో ఇది యాడ్ చేయనున్నారు. ఈ సినిమాలో చెప్పినట్టు కేరళలో 32 వేల మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చారని చెప్పడానికి ఎలాంటి ప్రామాణికత లేదని, అందుకే ఆ డిస్‌క్లయిమర్‌ సినిమాకు ముందు వేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.