Varaha Roopam song : ఇంకా కొనసాగుతున్న కాంతార వరాహరూపం సాంగ్ వివాదం.. సుప్రీం కోర్ట్ ఏమంది??

ఈ సినిమా ఓ వివాదంలో కూడా చిక్కుకుంది. కాంతార సినిమాలో వచ్చిన వరాహ రూపం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ పాట మ్యూజిక్ మాది అంటూ తైక్కుడం బ్రిడ్జ్ అనే ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తూ................

Varaha Roopam song : ఇంకా కొనసాగుతున్న కాంతార వరాహరూపం సాంగ్ వివాదం.. సుప్రీం కోర్ట్ ఏమంది??

Supreme Court Judgement on Varaha Roopam Song Issue

Varaha Roopam song :  కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కాంతార. చిన్న సినిమాగా రిలీజయి కన్నడలో విజయం సాధించిన అనంతరం దేశమంతటా విడుదల అయి భారీ విజయం సాధించింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

ఈ సినిమా ఓ వివాదంలో కూడా చిక్కుకుంది. కాంతార సినిమాలో వచ్చిన వరాహ రూపం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ పాట మ్యూజిక్ మాది అంటూ తైక్కుడం బ్రిడ్జ్ అనే ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తూ కోర్టుకి ఎక్కింది. అయితే మొదట ఆ పాటని సినిమాలో తీసేయాలని తీర్పు ఇచ్చింది లోకల్ కోర్టు. కానీ ఆ తర్వాత ఆ పాటపై నిషేధాన్ని ఎత్తివేసి సినిమాలో పెట్టుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. అయితే తైక్కుడం బ్రిడ్జ్ హైకోర్టుకి వెళ్లడంతో పాటను సినిమా నుంచి తొలిగించాలని ఆదేశాలిచ్చింది.

Tamannaah : కోయంబత్తూర్ లో తమన్నా పూజలు.. లింగ భైరవి అమ్మవారి గురించి గొప్పగా చెప్తూ వీడియో..

తాజాగా దీనిపై చిత్రయూనిట్ సుప్రీం కోర్టుకి వెళ్లగా కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పాటని సినిమా నుంచి తీసేయనవసరం లేదని, ఎవర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తూ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, హీరో రిషబ్ శెట్టికి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. విచారణని మళ్ళీ వాయిదా వేసింది. మరి దీనిపై తైక్కుడం బ్రిడ్జ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.