The Kerala Story : వెస్ట్ బెంగాల్‌లో కేరళ స్టోరీ నిషేధం పై సుప్రీమ్ కోర్టు స్టే.. తమిళనాడు ప్రభుత్వానికి..

కేరళ స్టోరీ సినిమా పై వెస్ట్ బెంగాల్‌ ప్రభుత్వం నిషేధం విధించడం పై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వానికి..

The Kerala Story : వెస్ట్ బెంగాల్‌లో కేరళ స్టోరీ నిషేధం పై సుప్రీమ్ కోర్టు స్టే.. తమిళనాడు ప్రభుత్వానికి..

supreme court stay on west bengal ban on The Kerala Story

Adah Sharma The Kerala Story : అదా శర్మ (Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా, సోనిలా బలాని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. కేరళలోని (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే వివాదాస్పద కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడంతో వివాదాల భారిన పడింది. ఇక ఎన్నో సమస్యలు మధ్య చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిషేదించింది.

Adipurush : ఆదిపురుష్ రన్ టైం ఎంతో తెలుసా.. జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్!

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కేరళ స్టోరీ ఉందంటూ సినిమాని బ్యాన్ చేసింది. తాజాగా ఈ నిర్ణయం పై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సర్టిఫికేట్ మంజూరు అయ్యిన తరువాత వాటికీ తగట్టు రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను నిర్వహించాలని కోర్టు సూచింది. అయితే CBFC సర్టిఫికేషన్‌ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ పై తుది తీర్పు ఇవ్వాలంటే.. కోర్టు ముందుగా కేరళ స్టోరీని చూడవలసి ఉంటుంది. వేసవి సెలవుల అనంతరం జూలైలో ఈ పిటిషన్ పై తుది నిర్ణయం వెల్లడిస్తామంటూ కోర్టు పేర్కొంది.

Lal Salaam : ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో.. లాల్ సలామ్‌లో రజినీకాంత్, కపిల్ దేవ్..

అలాగే తమిళనాడులో భద్రతా కారణాల దృష్ట్యా సినిమాని థియేటర్ యజమానులు స్వచంగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడం పై కూడా కోర్టు తీర్పునించింది. సినిమా ప్రేక్షకులకు భద్రత కల్పించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది. ఇక ఈ తీర్పుతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.171.72 గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ సినిమాలను వెనెక్కి నెట్టి షారుఖ్ పఠాన్ స్థానంలో సెకండ్ ప్లేస్ లో ఈ సినిమా నిలిచింది.