Bigg Boss 5: బిగ్‌బాస్ ఇంట్లో సురేఖా.. ఇన్ని ట్విస్ట్‌లేంటో!

బిగ్ బాస్ షో ఐదవ సీజన్ కోసం వెండితెర నుండి సోషల్ మీడియా సెలబ్రిటీల వరకు ఎందరో ఉండగా ఆ చక్కర్లు కొట్టే జాబితాలో సిల్వర్ స్క్రీన్ మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ క్రేజ్ ఉన్న సురేఖావాణి పేరు కూడా వినిపిస్తుంది.

10TV Telugu News

Bigg Boss 5: పలు భాషలు.. దేశాలు.. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో పక్కా గ్యారంటీ, సక్సెస్ ఫార్ములా. మన దేశంలో కూడా చాలా బాషలలో ఇప్పటికే ఇది మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న షో. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే సరికొత్తగా హౌస్ సెట్ సిద్ధం చేసిన షో నిర్వాహకులు.. ఐదవ సీజన్ లోగోను కూడా విడుదల చేశారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈలోగా ఈ షో మీదున్న క్రేజ్ తో ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేది అంచనాలు కూడా బయటకొచ్చాయి. అందులో వెండితెర నుండి సోషల్ మీడియా సెలబ్రిటీల వరకు ఎందరో ఉండగా ఆ చక్కర్లు కొట్టే జాబితాలో సిల్వర్ స్క్రీన్ మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ క్రేజ్ ఉన్న సురేఖావాణి పేరు కూడా వినిపిస్తుంది. దాదాపుగా బిగ్ బాస్ హౌస్ లోకి సురేఖావాణి ఎంట్రీ గ్యారంటీ అనే ప్రచారం జరుగుతుంది.

అయితే, దీనిపై స్పందించిన సురేఖా వాణి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. చేతులెత్తి దండం పెడుతున్నట్టుగా ఎమోజీలతో.. ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి.. నేను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదు అని ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఒకరకంగా బిగ్ బాస్ హౌస్ లోకి సురేఖా ఎంట్రీ క్లారిటీ వచ్చింది అనుకొనేలోగానే ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసి మాయం చేసింది. దీంతో అసలు ప్రచారం జరుగుతున్నట్లుగా ఆమె హౌస్ లోకి వెళ్తుందా.. లేక ఖండించినట్లుగా వెళ్లడం లేదా అన్నది మరింత కన్ఫ్యూజన్ గా మారింది.

10TV Telugu News