Surekha Vani: పవన్ కళ్యాణ్‌కు వంద ముద్దులు ఇస్తానంటోన్న సురేఖ వాణి

విజయ్‌తో చేసిన సీన్స్ ఉన్నాయని తెలిపింది. చివరగా పరిశ్రమలోని హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే ఎవరికిస్తారని అడగ్గా.. ఏమాత్రం ఆలోచించకుండా పవర్‌ స్టార్‌ ..

Surekha Vani: పవన్ కళ్యాణ్‌కు వంద ముద్దులు ఇస్తానంటోన్న సురేఖ వాణి

Pawan Kalyan Surekha Vani

Surekha Vani: అక్కలా.. తల్లిగా.. కోడలుగా.. భార్యలా ఎన్నో సినిమాల్లో కనిపించిన క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సురేఖ ఈ మధ్య కాస్తా సినిమాలు తగ్గించారు.. సినిమాపరంగా దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇటీవల ఓ ఛానెల్ లోని ప్రోగ్రాంకు గెస్ట్ గా వచ్చిన ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

లవ్ మ్యారేజి చేసుకున్న ఆమె.. భర్త చనిపోయాక అత్తింటి వేధింపులు తట్టుకోలేక బయటక వచ్చానంటూ భావోద్యేగానికి లోనైంది. తెలుగు సినిమా హీరోల్లో తాను చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన్ను చూసినప్పుడల్లా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పింది. అలా ఒకరోజు ఏడుస్తుంటే చిరంజీవి ఓదార్చారని, ఆ తర్వాత ఒకరోజు వాళ్ల ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారంటూ చెప్పుకొచ్చింది.

తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా నటించారట. హిందీలో మిథున్ చక్రబర్తి, జాకీష్రాఫ్ నటించిన సినిమాల్లో చెల్లెలి పాత్రలు చేసిందట సురేఖ వాణి. ఇక ఈ ఏడాది విజయ్‌ లీడ్ రోల్ లో కనిపించిన మాస్టర్‌ మూవీలో కూడా నటించింది కానీ, థియేటర్లలో సీన్‌ కట్‌చేసినట్లు ఆమె బయటపెట్టారు.

ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో మాత్రం విజయ్‌తో చేసిన సీన్స్ ఉన్నాయని తెలిపింది. చివరగా పరిశ్రమలోని హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే ఎవరికిస్తారని అడగ్గా.. ఏమాత్రం ఆలోచించకుండా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పేరు చెప్పడం షాకింగ్ గా అనిపించింది.

సురేఖ వాణి కూతురు సుప్రితా సైతం తల్లికి తగ్గ కూతురే. సోషల్‌ మీడియాల్లో ఫుల్‌ యాక్టివ్‌ ఉంటూ తన పోస్టులకు నెటిజన్లు పెట్టే కామెంట్స్ కు ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతుంటారు. ప్రస్తుతం సుప్రీయ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటుందని, సినిమాల్లోకి రావడం రాకపోవడం అప్పుడే కన్ఫామ్ కాలేదని సురేఖ వాణి చెప్పుకొచ్చారు.