Supritha : సురేఖవాణి కూతురు బాయ్‌ఫ్రెండ్‌ని ఇతనే..

సురేఖవాణి కూతురు సుప్రీత తన బాయ్ ఫ్రెండ్ ని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఓ వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. అతని ప్రేమకు ఓకే చెప్పాను అంటూ ఇన్‌స్టాలో.....

Supritha : సురేఖవాణి కూతురు బాయ్‌ఫ్రెండ్‌ని ఇతనే..

Supritha

Supritha :  క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖవాణి ఎంత ఫేమస్సో మన అందరికి తెలుసు. ఎన్నో ఏళ్ళ నుంచి సినిమాల్లో నటిస్తుంది. సినిమాల్లోనే కాక సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో రచ్చ చేస్తుంది. అంతే కాక సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంది. సుప్రీతతో కలిసి పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలు పెడుతుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ తల్లి కూతుళ్ళకి అభిమానులు కూడా బాగానే ఉన్నారు. వీరిద్దరికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

Dulquer Salman : మలయాళ స్టార్ హీరోకి కరోనా.. మొన్న తండ్రి.. నేడు తనయుడు..

సురేఖ వాణి భర్త కొంతకాలం క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఇద్దరే ఉంటున్నారు. తాజాగా సుప్రీత తన బాయ్ ఫ్రెండ్ ని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఓ వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. అతని ప్రేమకు ఓకే చెప్పాను అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సుప్రీత షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. సుప్రీత ప్రియుడి పేరు రాకీ జోర్డాన్‌ కాగా అతను నటుడు, ర్యాపర్‌ అని సమాచారం. వీరిద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నట్టు, ఇటీవల సురేఖవాణితో సుప్రీత మాట్లాడి ఇతనికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి.