MayaBazar : మాయాబజార్ వీళ్లిద్దరికీ ఎంత స్పెషలో తెలుసా??

ఈ ఎపిసోడ్ లో ఎన్నో సినిమాల గురించి, సినిమాల విషయాల గురించి మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల ఫోటోలు చూపించి వాటి గురించి చెప్పామన్నారు. ఇందులో భాగంగా మొదట మాయాబజార్ సినిమా పోస్టర్ చూపించారు................

MayaBazar : మాయాబజార్ వీళ్లిద్దరికీ ఎంత స్పెషలో తెలుసా??

MayaBazar :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది.

ఈ ఎపిసోడ్ లో ఎన్నో సినిమాల గురించి, సినిమాల విషయాల గురించి మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాల ఫోటోలు చూపించి వాటి గురించి చెప్పామన్నారు. ఇందులో భాగంగా మొదట మాయాబజార్ సినిమా పోస్టర్ చూపించారు.

Raghavendra Rao : చిన్నప్పుడే బన్నీ వాళ్ళ అమ్మకి 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి హీరోని చేస్తా అని చెప్పాను

మాయాబజార్ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను నా లైఫ్ లో మొట్టమొదట చూసిన సినిమా షూటింగ్ ఇదే. నాకు అప్పుడు ఐదేళ్లు. నాన్న అందులో నటించారు. నన్ను ఒకసారి షూటింగ్ కి తీసుకెళ్లారు. ఆ రోజు నాన్న, వంగర గారిది సీన్ జరుగుతుంది. అలా నేను ఫస్ట్ చూసిన షూటింగ్ గా బాగా గుర్తుండిపోయింది ఈ సినిమా అని చెప్పారు. ఇక సురేష్ బాబు.. ఈ సినిమాకి వాడిన కెమెరాని వాహిని సంస్థ వాళ్ళు అమ్మితే నేను కొనుక్కొని నా ఆఫీస్ లో పెట్టుకున్నాను అని తెలిపారు.