Suresh Babu : రాజేష్ ఖన్నాతో గొడవ.. ప్రేమ్ నగర్ షూటింగ్ ఆపేశాం..

బాలయ్య బాబు పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో షూటింగ్స్ కి బాగా ఎవరు లేట్ గా వస్తారు అని అడిగారు. దీనికి అల్లు అరవింద్ వాళ్ళ నాన్న పేరు రాశారు. అల్లు రామలింగయ్య గారు చాలా వరకు షూటింగ్స్ కి.................

Suresh Babu : రాజేష్ ఖన్నాతో గొడవ.. ప్రేమ్ నగర్ షూటింగ్ ఆపేశాం..

Suresh Babu :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది.

ఈ ఎపిసోడ్ లో అనేక సినిమా విషయాల గురించి మాట్లాడారు. అలాగే బాలయ్య బాబు పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో షూటింగ్స్ కి బాగా ఎవరు లేట్ గా వస్తారు అని అడిగారు. దీనికి అల్లు అరవింద్ వాళ్ళ నాన్న పేరు రాశారు. అల్లు రామలింగయ్య గారు చాలా వరకు షూటింగ్స్ కి లేట్ గా వస్తారు. నేను నిర్మాతగా చేసిన సినిమాలకి కూడా లేట్ గా వస్తారు అని చెప్పారు.

Balakrishna : జగన్ తో టాలీవుడ్ మీటింగ్ పై బాలయ్య బాబు సెటైర్లు..

ఇక సురేష్ బాబు రాజేష్ ఖన్నా, వాణిశ్రీ అని చెప్పారు. ప్రేమ్ నగర్ సినిమాని రాజేష్ ఖన్నాతో బాలీవుడ్ లో తీస్తున్నప్పుడు డైలీ లేట్ గా వచ్చేవాళ్ళు. ఈ విషయంలో పెద్ద గొడవ కూడా అయింది నాన్న గారికి, రాజేష్ ఖన్నాకి. సెట్ కి లేట్ గా వస్తున్నారని ఒకసారి షూటింగ్ కూడా ఆపేశాం. కానీ చివరికి ఎలాగోలా సినిమాని పూర్తి చేశాం అని తెలిపారు. ఇక వాణిశ్రీ కూడా మొదట్లో లేట్ గా వచ్చేవాళ్ళు ఆ తర్వాత మార్చుకున్నారు అని చెప్పారు.