Suresh Productions: యాభై యేళ్ల లెగసీ.. మరో రంగంలోకి సురేష్ ప్రొడక్షన్స్ అడుగులు

సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.. మూవీ మొఘల్ దివంగత దగ్గుబాటి రామానాయుడు, తన పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద స్థాపించిన సంస్థ.. వందలకు పైగా సినిమాలు చేసిన ఈ సంస్థ..

Suresh Productions: యాభై యేళ్ల లెగసీ.. మరో రంగంలోకి సురేష్ ప్రొడక్షన్స్ అడుగులు

Suresh Productions Music

Suresh Productions Music: సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.. మూవీ మొఘల్ దివంగత దగ్గుబాటి రామానాయుడు, తన పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద స్థాపించిన సంస్థ.. వందలకు పైగా సినిమాలు చేసిన ఈ సంస్థ.. సినిమారంగంలో ఓ ప్రముఖపాత్ర పోషించిన సురేష్ ప్రొడక్షన్స్.. ఇప్పుడు మరో రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈమేరకు కీలక అడుగులు వేస్తుంది సురేష్ ప్రొడక్షన్స్.

1963లో స్థాపించిన ఈ సంస్థలో ఫస్ట్ సినిమా అనురాగం వెండితెరపైకి రాగా.. 1964లో ఎన్టీఆర్‌తో చేసిన రాముడు భీముడు ఫస్ట్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. యాభై యేళ్ల పాటు దేశంలోని అన్నీ ప్రాంతీయ భాషల్లో సినిమాను తెరకెక్కించిన సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు కొత్త లేబుల్‌తో సంగీత పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించింది సురేష్ ప్రొడక్షన్స్.

టాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని యాక్టివ్ మ్యూజిక్ లేబుల్స్ ఉండగా.. మ్యూజిక్ ఇండస్ట్రీకి డిమాండ్ ఉండడంతో.. సురేష్ ప్రొడక్షన్స్ ‘SP MUSIC’ పేరుతో ఈ రంగంలో కూడా ముందుండాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబందించిన అన్ని పనులు పూర్తికాగా.. లేటెస్ట్‌గా ప్రకటన చేశారు. 50 ఏళ్లుగా సినిమా లెగసీని కంటిన్యూ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ అనే మ్యూజిక్ లేబుల్‌ను ప్రారంభించబోతుంది. SP MUSIC సంగీతాన్ని అందించేందుకు సంగీత శక్తికి కేంద్రంగా మారడమే లక్ష్యంగా దీనిని ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేశారు.


సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సినిమాలను నిర్మించడమే కాక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ, సినిమా థియేటర్లను కూడా నడుపుతోంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప అలాగే దృశ్యం 2 సినిమా రీమేక్ ఈ సంస్థ నుంచి రాబోతున్నాయి. వాస్తవానికి అందరూ సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ సంస్థను లాంచ్ చేస్తుందని భావించిన సమయంలో మ్యూజిక్ లేబుల్‌తో ముందుకు రావడం విశేషం.