Suriya: బర్త్‌డే ట్రీట్.. వాడివాసల్ వీడియోలో అదరగొట్టిన సూర్య

తమిళ హీరో ‘సూర్య’ నేడు పుట్టినరోజు జరుపుకుంటుండటంతో ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే సూర్య పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వాడి వాసల్’ చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.

Suriya: బర్త్‌డే ట్రీట్.. వాడివాసల్ వీడియోలో అదరగొట్టిన సూర్య

Suriya From Vaadi Vaasal Making Video Impresses

Suriya: తమిళ హీరో ‘సూర్య’ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఉత్తమ నటుడిగా 68వ జాతీయ ఫిలిం అవార్డ్ అందుకున్న సూర్య నేడు పుట్టినరోజు జరుపుకుంటుండటంతో ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక సూర్య కూడా తనకు నేషనల్ అవార్డ్ రావడంపై తన అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. అయితే సూర్య పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వాడి వాసల్’ చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.

Suriya : సూరరై పొట్రుకు ఐదు జాతీయ అవార్డులు.. హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్..

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలోని ఓ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పొగరబోతు ఎద్దును సూర్య ఏ విధంగా ఆపాడో మనకు చిత్ర యూనిట్ చూపించింది. ఎద్దును లొంగదీసుకునే ట్రెయినింగ్ తీసుకుంటున్న సూర్యకు తెలియకుండానే ఈ వీడియోను తీశారట చిత్ర యూనిట్. ఆయన పుట్టినరోజు కానుకగా నేడు ఈ మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసి ఆయన్ను సర్‌ప్రైజ్ చేశారు.

Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ ఓకే అయిందా?

ఇక సూర్య ఈ సినిమాలో మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. జల్లికట్టు ఆట నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఈ చిత్ర టైటిల్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక విలక్షణ చిత్రాల దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తమిళనాట అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.