Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ ఓకే అయిందా?

తాజాగా సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సూర్య కెరీర్ లో ఫుల్ స్పీడ్ మీదున్నారు. అటు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూనే హీరోగా మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా....................

Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ ఓకే అయిందా?

Suriya

Suriya :  తమిళ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. సూర్య సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. కానీ సూర్య ఇప్పటివరకు డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు. సూర్య తర్వాత వచ్చిన తమ్ముడు కార్తి తెలుగులో డైరెక్ట్ సినిమా చేసేశాడు. తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించాడు. కానీ సూర్య మాత్రం ఇప్పటి వరకూ అదిగో ఇదిగో తెలుగు సినిమా అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

అయితే తాజాగా సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సూర్య కెరీర్ లో ఫుల్ స్పీడ్ మీదున్నారు. అటు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూనే హీరోగా మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విక్రమ్ తో సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిన సూర్య ఇప్పుడు తమిళ్ మార్కెట్ తో పాటు తెలుగు మార్కెట్ మీద కూడా మరింత కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. తమిళ్ తో పాటే తెలుగులో కూడా రీచింగ్ ఎక్కువగా ఉండడంతో డబ్బింగ్ సినిమాలతో కాకుండా ఈసారి డైరెక్ట్ తెలుగు మూవీతో తెరమీదకొస్తున్నారు అని తెలుస్తుంది.

Shahrukh Khan : డైరెక్టర్స్‌కి కండిషన్స్ పెడుతున్న బాలీవుడ్ బాద్షా..

ఎప్పటి నుంచో సూర్య తెలుగు ఎంట్రీ గురించి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ సరైన టైమ్ కోసం వెయిట్ చేసిన సూర్య రజినీకాంత్ తో అన్నాతే సినిమా తీసిన డైరెక్టర్ శివ తో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీని ఓకే చేశారట. శివ గతంలోనే తెలుగులో శంఖం, శౌర్యం, దరువు సినిమాలు డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ శివ ఇప్పటికే సూర్య కి స్టోరీ నెరేట్ చేసి ఓకే చేయించుకున్నారు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు యు.వి క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుందని సమాచారం. ఈ సారి శివ డైరెక్షన్లో మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులని డైరెక్ట్ గా పలకరించనున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డేని తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాడని తెలియడంతో తెలుగు సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.