Suriya: తన సినిమా రీమేక్‌లో.. తానే కేమియోగా వస్తున్న సూర్య!

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల తన సినిమాలను వరుసగా ఓటీటీలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కాగా, ఆయన నటించిన ఈటీ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసినా, అది....

Suriya: తన సినిమా రీమేక్‌లో.. తానే కేమియోగా వస్తున్న సూర్య!

Suriya To Do A Cameo In Remake Movie Of His Own

Suriya: తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల తన సినిమాలను వరుసగా ఓటీటీలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కాగా, ఆయన నటించిన ఈటీ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసినా, అది అట్టర్ ఫ్లాప్ మూవీగా మిగిలింది. దీంతో సూర్య నుండి మరోసారి బ్లాక్‌బస్టర్ మూవీని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. అయితే మరో స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ సినిమాలో మాత్రం రోలెక్స్ అనే పాత్రలో సూర్య ఎంట్రీ, ఆయన పర్ఫార్మెన్స్‌ను తమిళ, తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. దీంతో సూర్య నుండి వారు ఇలాంటి మాస్ యాక్షన్ మూవీని ఎక్స్ పెక్ట్స్ చేస్తున్నారు.

Suriya : రోలెక్స్ సర్‌కి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్

ఇదిలా ఉంటే, సూర్య నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు చిత్ర యూనిట్. సెన్సేషనల్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో సూర్య పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను ఆడియెన్స్ బాగా ఆదరించారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను సుధా కొంగర తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Suriya: ఒకవైపు స్టోరీ బేస్డ్ సినిమాలు.. మరోవైపు రొట్ట కొట్టుడు.. అస్సలు అర్థం కాడు!

హిందీలో రీమేక్ అవుతున్న ఆకాశమే నీ హద్దురా సినిమాలో సూర్య ఓ కేమియో రోల్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. సుధా కొంగర సూర్యను ఈ మేరకు రిక్వెస్ట్ చేయడంతో ఆయన వెంటనే ఓకే చెప్పాడట. అంటే.. ఆయన హీరోగా నటించిన సినిమా రీమేక్‌లో ఆయనే మళ్లీ కేమియో పాత్రలో నటిస్తుండటంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ రీమేక్ సినిమాలో సూర్య ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి అంటున్నారు ఆయన అభిమానులు.