అసురన్ దర్శకుడితో సూర్య

  • Published By: vamsi ,Published On : December 22, 2019 / 06:50 AM IST
అసురన్ దర్శకుడితో సూర్య

తెలుగు, త‌మిళ సినిమా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య దక్షిణాదిలోని ప్రతి ఇండస్ట్రీలోను మార్కెట్ పెంచుకున్నాడు. సినిమా కోసం ఎలాగైనా మారగలిగే సూర్య సరైన క్యారెక్టర్ వస్తే నటనలో విజృంభిస్తాడు. మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకరైన సూర్య.. ప్ర‌స్తుతం ‘గురు’ ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో  ‘శూర‌రై పోట్రు’ అనే సినిమాలో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’ అనే పేరుతో విడుద‌ల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ సినిమా త‌ర్వాత సూర్య త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ ఇచ్చేశారు.

త‌మిళంలో వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్‌. ఇటీవల ధనుష్ హీరోగా `అసుర‌న్‌` సినిమాని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడితో సూర్య సినిమా చేయ‌బోతున్నాడు. ప్రముఖ నిర్మాత క‌లైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్య కెరీర్‌లో ఇది 40వ సినిమా.