RAP019: సర్‌ప్రైజ్.. రామ్ షూటింగ్ సెట్‌లో దర్శకుడు శంకర్!

యంగ్ హీరో రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి ఓ బైలింగువల్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఊర మాస్ సినిమాను స్టైలిష్ గా తెరకెక్కించే లింగుస్వామి ఈసారి కూడా రామ్ కు తగ్గట్లే అదే తరహా సినిమాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.

RAP019: సర్‌ప్రైజ్.. రామ్ షూటింగ్ సెట్‌లో దర్శకుడు శంకర్!

Rap019

RAP019: యంగ్ హీరో రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి ఓ బైలింగువల్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఊర మాస్ సినిమాను స్టైలిష్ గా తెరకెక్కించే లింగుస్వామి ఈసారి కూడా రామ్ కు తగ్గట్లే అదే తరహా సినిమాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. హీరో రామ్, హీరోయిన్ కృతిశెట్టిల, నదియాలపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

కాగా, స్టార్ డైరెక్టర్ శంకర్ బుధవారం ఈ సినిమా షూటింగ్ సెట్స్ కి వచ్చి సర్‌ప్రైజ్ చేశారు. సడన్‌గా సెట్స్‌కు వచ్చిన శంకర్‌ ని చూసి టీమ్ అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. శంకర్ రాకతో సంభ్రమాశ్చర్యాలకులోనైన రామ్, కృతి, నదియా, లింగుస్వామి ఆయనకు ఘన స్వాగతం పలికింది. హీరో రామ్ తో కలిసి కాసేపు షూటింగ్ విషయాలను తెలుసుకున్న శంకర్ కు ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన లవ్ సాంగ్ ట్యూన్ వినిపించారు. మెలోడీయస్ గా ఉందని, చాలా బావుందని శంకర్ ప్రశంసించారని నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమాకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన శంకర్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరో తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమా కావడం.. శంకర్ కూడా తెలుగు హీరోతో సినిమాకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రామ్ సినిమా సెట్స్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ తరహా సన్నివేశాలను చూస్తే తమిళ, తెలుగు ఇండస్ట్రీల మధ్య తత్సంబంధాలు మరింత మెరుగవుతున్నట్లు కనిపిస్తుంది.