Surrogacy : బాలీవుడ్ సరోగసి సినిమాలు..

సరోగసి పాయింట్‌ని తీసుకుని బాలీవుడ్ మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లను సిల్వర్ స్క్రీన్ మీద చూపించారు.. హీరోయిన్లు కూడా ప్రెగ్నెంట్ వుమెన్ వంటి ఛాలెంజింగ్ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించారు..

Surrogacy : బాలీవుడ్ సరోగసి సినిమాలు..

Surrogacy Movies Of Bollywood

Surrogacy: సరోగసి (కృత్రిమ గర్భధారణ) అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. భారత్‌తో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో సరోగసి అనేది కామన్ విషయం. ఇదే సరోగసి పాయింట్‌ని తీసుకుని బాలీవుడ్ మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లను సిల్వర్ స్క్రీన్ మీద చూపించారు. హీరోయిన్లు కూడా ప్రెగ్నెంట్ వుమెన్ వంటి ఛాలెంజింగ్ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించారు. తమ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీలో వచ్చిన కొన్ని సరోగసి సినిమాల విశేషాలు చూద్దాం..

కృతి సనన్ – ‘మిమి’..
కృతి సనన్, పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్‌లో లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిమి’ సినిమాలో కృతి, కృత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డను కనే క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిమి’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Mimi

ప్రీతి జింటా – ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’..
అయితే హిందీలో సరోగసి కథాంశంతో సినిమాలు తెరకెక్కించడం అనే అంశానికి రెండు దశాబ్దాల క్రితమే బీజం పడింది. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా నటించిన మూవీ ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’.. సరోగసి పద్ధతిలో సల్మాన్ బిడ్డకు జన్మనిచ్చే తల్లి క్యారెక్టర్‌లో ప్రీతి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అబ్బాస్ – మస్తాన్ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ ఫిలిం మంచి విజయం సాధించింది.

Chori Chori Chupke Chupke

సుస్మితా సేన్ – ‘ఫిల్హాల్’..
మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేసిన ‘ఫిల్హాల్’ మూవీలో సుస్మితా సేన్ టబు బిడ్డకు సరోగేట్ మదర్‌గా నటించింది. సంజయ్ సూరి, పలాష్ సేన్ హీరోలుగా నటించిన ఈ సినిమా.. సరోగసి లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల పట్ల ప్రేక్షకులకు అంతగా అవగాహన లేని, ప్రీ-మల్టీప్లెక్స్ టైంలోనే రావడం విశేషం.

Filhaal

దివ్య దత్తా – ‘లైఫ్ ఎక్స్‌ప్రెస్’..
‘ఫిల్హాల్’ లాగానే రితుపర్ణ సేన్ గుప్తా, దివ్య దత్తా ఫీమేల్ లీడ్స్‌గా నటించిన సినిమా ‘లైఫ్ ఎక్స్‌ప్రెస్’.. కరణ్ జంజని, యశ్ పాల్ శర్మ మేల్ లీడ్స్‌గా చేశారు. కెరీర్ కంటిన్యూ చెయ్యాలనుకుని రీతు, దివ్య అద్దె గర్భంతో బిడ్డను కనాలనుకునే పాయింట్‌తో వచ్చిన ఈ మూవీ సరైన ప్రేక్షకాదరణకు నోచుకోకుండానే అలా వచ్చి ఇలా మాయమైంది.

Life Express

పాత్రా లేఖ – ‘బద్నాం గాలి’..
సరోగసి నేపథ్యంలో వచ్చిన మరో సినిమా ‘బద్నాం గాలి’.. పాత్రా లేఖ పాల్, దివ్యేందు శర్మ (మీర్జాపూర్ ఫేమ్) లీడ్ రోల్స్ చేశారు. అశ్విన్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయినా పెద్దగా గుర్తింపు రాలేదు.

Badnaam Gali

మోనిక పర్వార్ – ‘దుకాణ్’..
అద్దె గర్భం కథాంశంతో ‘పెయిడ్ అండ్ డెలివర్డ్’ అంటూ మోనిక పర్వార్ మెయిన్ లీడ్‌గా సిద్ధార్థ్ – గరిమా వహాల్ డైరెక్షన్లో అనౌన్స్ చేసిన సినిమా ‘దుకాణ్’.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ వదిలినప్పటి నుండి ఈ మూవీ మీద హైప్ క్రియేట్ అయ్యింది. 2022లో ‘దుకాణ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dukaan