వెబ్ సిరీస్ లో నటిస్తున్న సూర్య

  • Published By: Chandu 10tv ,Published On : July 15, 2020 / 11:41 AM IST
వెబ్ సిరీస్ లో నటిస్తున్న సూర్య

కరోనా…అన్ని రంగాలను కుదిపేస్తోంది. ఈ రంగం..ఆ రంగం అనే తేడా లేదు. ఇందులో సినిమా రంగం ఒకటి. కరోనా వైరస్ కారణంగా..ఈ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. థియేటర్లు నాలుగు నెలలకు పైగా మూత పడ్డాయి. షూటింగ్ లు లేక..కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమాలకు ఒప్పుకుని..ఫైనాన్స్ తీసుకుని..దర్శక, నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నటులు, దర్శక, నిర్మాతలు, ఇతరులు ప్రత్నామ్నాయ మార్గాల వైపు ఫోకస్ చేస్తున్నారు. ఎలాగైన ప్రేక్షకులకు దగ్గర కావాలని, వచ్చిన నష్టాలను కొంతవరకైనా పూడ్చుకోవాలని అనుకుంటున్నారు. కొంత మంది OTTల వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నాయి. ఈ మేరకు హీరోలను సంప్రదిస్తున్నారు. కొంతమంది ఒకే చెప్పేస్తున్నారు.

తాజాగా…హీరో సూర్య త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘నవరస’…ఇందులో మొత్తం 9 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. మొత్తం ఎపిసోడ్ లో కేవలం ఒక ఎపిసోడ్ లో మాత్రమే సూర్య కనబడతారని తెలుస్తోంది.

అంతేకాదు సూర్యతో పాటు విక్రమ్, మాధవన్, సిద్దార్థ్ ఇంకా కొంతమంది ఇందులో నటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఎపిసోడ్లు తెరకెక్కించే దర్శకుల లిస్టులో మణిరత్నంతో పాటు గౌతమ్ మేనాన్, బీజొయ్ నంబియార్, అరవింద స్వామి తదితరులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగు నుంచి కూడా కొంతమంది కథానాయికలు, దర్శకులు ఇందులో పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సూర్య వెబ్ సిరీస్ లో అడుగు పెట్టనున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.