Swathi Muthyam: ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ పెద్ద సినిమాలే.. కానీ దియేటర్లు నా చేతిలో ఉన్నాయి.. స్వాతిముత్యం ప్రొడ్యూసర్!

ఈ దసరా నవరాత్రులకు సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. టాలీవుడ్ టాప్ హీరోలు కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఈ రేసులో నిలవబోతుండగా.. వీరికి పోటి ఇస్తూ ఒక అప్ కమింగ్ హీరో బరిలో నిలుస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ఈ సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నాడు.

Swathi Muthyam: ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ పెద్ద సినిమాలే.. కానీ దియేటర్లు నా చేతిలో ఉన్నాయి.. స్వాతిముత్యం ప్రొడ్యూసర్!

Suryadevara Naga Vamsi Comments on Swathi Muthyam Release

Swathi Muthyam: ఈ దసరా నవరాత్రులకు సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. టాలీవుడ్ టాప్ హీరోలు కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఈ రేసులో నిలవబోతుండగా.. వీరికి పోటి ఇస్తూ ఒక అప్ కమింగ్ హీరో బరిలో నిలుస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ఈ సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నాడు.

Swathimuthyam Trailer: స్వాతిముత్యం ట్రైలర్.. పండుగకు పర్ఫెక్ట్ సబ్జెక్టుతో దిగుతోన్న బెల్లంకొండ హీరో!

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక సినిమా ప్రమోషన్స్ లో ప్రొడ్యూసర్ నాగవంశీని, చిరంజీవి-నాగార్జున సినిమాల మధ్య మీ సినిమాను విడుదల చేస్తున్నారు భయంగా లేదా అని ప్రశ్నించగా, నిర్మాత బదులిస్తూ.. “ఇది చిన్న సినిమైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది. మా చేతిలోనూ థియేటర్లు ఉంటాయి, మార్నింగ్, మాటినీ షోలు.. ఆ సినిమాలకు వెళ్లినా, ఫస్ట్ షోకి మా సినిమా చూస్తారు అనే నమ్మకంతో రిలీజ్ చేసేస్తునాం” అని వెల్లడించాడు.