సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు చేసి తెలియకుండానే చంపేసింది: కేకే సింగ్

సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు చేసి తెలియకుండానే చంపేసింది: కేకే సింగ్

సుశాంత్ సింగ్ ఆత్మహత్యా.. హత్యా అనే కోణంలో చేస్తున్న దర్యాప్తులో సీబీఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని కూడా విచారణకు పిలిచారు. నేరుగా రియాను అరెస్టు చేస్తే కేసు నీరుగారిపోతుందని.. పకడ్బంధీగానే విచారణ జరుపుతున్నారు. ముందుగా రియా సోదరుడు షోవిక్ ను కూడా విచారించారు. కాగా, రియా సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసి తెలియకుండానే చంపేసిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపణలు గుప్పించారు.



ఈ క్రమంలోనే షోవిక్ చక్రవర్తిని డీఆర్డీవో అధికారులు ఇన్వెస్టిగేషన్ కు పిలిచారు. రీసెంట్ గా రియా చక్రవర్తిని డ్రగ్స్ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుపుతుండగా.. ఆమె తండ్రికి కూడా ఇందులో పాత్ర ఉందేమోనని విచారణ జరుపుతున్నారు. రియా చక్రవర్తి నా కొడుక్కి విషం ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా అలవాటు చేసింది. తెలియకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమెను, ఆమె సహచరులను అరెస్టు చేశారు.

రియా చక్రవర్తి…డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసిందని తేలింది. ఈ వాట్సాప్ చాట్ ను రియా తొలగించినా, దీన్ని అధికారులు తిరిగి పొందారు. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడటంతో ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం రేకెత్తింది.



‘‘మనం హార్డ్ డ్రగ్ గురించి మాట్లాడాలి. నేను దీన్ని వాడలేదు’’ అని రియా 2017 మార్చి 8వతేదీన డ్రగ్ డీలరు గౌరవ్ తో వాట్సాప్ చాట్ చేసింది. రెండోసారి మాదకద్రవ్యాల డీలరు గౌరవ్ తో రియా మాట్లాడుతూ ‘‘మీ వద్ద ఎండీ ఉందా?’’ అని అడిగింది. ఎండీ అంటే మిథిలీన్ డయాక్సీ మెథాంపేటమిన్ అని బలమైన మాదకద్రవ్యం. కాగా, ఇటీవల మహేష్‌ భట్‌, రియా వాట్సాప్‌ చాట్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

అంతేగాక శామ్యూల్ మిరాండా, రియా మధ్య జరిగిన చాట్‌ను కూడా వెల్లడైంది. ఇందులో.. ‘హాయ్ రియా, విషయం దాదాపుగా ముగిసింది. అని మిరాండా చెప్పారు. ఈ సంభాషణ 2020 ఏప్రిల్ 17 న జరిగింది. ఆ తరువాత మేము షోవిక్ స్నేహితుడి నుంచి డ్రగ్స్ తీసుకోవచ్చా? కానీ అతని దగ్గర హాష్, (బడ్‌) మొగ్గ మాత్రమే ఉన్నాయి. అని మిరాండా రియాను అడిగారు. అయితే హాష్, మొగ్గ అనేవి తక్కువ తీవ్రత కలిగిన డ్రగ్స్‌గా పరిగణిస్తారు. ఇక ప్రస్తుతం డ్రగ్‌ డీలర్‌తో జరిగిన ఈ సంభాషణను చూస్తుంటే రియాపై మరింత అనుమానాన్ని పెంచుతున్నాయి. రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.