సుశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం: రియా, మహేష్ భట్ Whats App Chat లీక్!

  • Published By: vamsi ,Published On : August 21, 2020 / 11:36 AM IST
సుశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం: రియా, మహేష్ భట్ Whats App Chat లీక్!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసు దర్యాప్తు మొదలు పెట్టారు సీబీఐ అధికారులు. ఇందుకోసం వారు ముంబై చేరుకోగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై పెరుగుతున్న అనుమానాలు రోజురోజుకి మరింత బలంగా మారుతున్నాయి. సీబీఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి రియా చక్రవర్తిపై అనుమానాలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సుశాంత్ మరణానికి ముందు రియా మహేష్ భట్ మధ్య జరిగిన Whats App Chat స్క్రీన్ షాట్ బయటపడింది. నేషనల్ మీడియాలో ప్రస్తుతం ఆ న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.



నిర్మాత మహేష్ భట్ నిర్మించిన జలేబి సినిమాలో రియా చక్రవర్తి అయేషా అనే పాత్రలో నటించింది. అప్పటి నుంచి ఆమె మహేష్ భట్ కి చాలా సన్నిహితంగా ఉంటోంది. సుశాంత్ మరణించిన తరువాత వారికి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య జరిగిన చాట్ సుశాంత్ మరణానికి 6 రోజుల ముందు, అంటే జూన్ 8 రాత్రి 7:43 నుంచి 8:08 గంటల మధ్య చోటుచేసుకుంది. రియా సుశాంత్ ఇంటిని విడిచిపెట్టిన రోజు ఇది. చాట్ ప్రకారం, రియాను వెనక్కి వెళ్లొద్దని భట్ సలహా ఇచ్చాడు.



దీనిని బట్టి చూస్తే.. మహేష్ భట్ కూడా సుశాంత్ నుంచి విడిపోవడమే మంచిది అనే విదంగా రియాకు సలహా ఇచ్చినట్లు అర్ధమవుతోంది. మహేష్ భట్ తో రియా చేసిన వాట్స్ అప్ చాట్‌లో సుశాంత్ తో బ్రేక్ అప్ గురించి మాట్లాడడం విశేషం. రియా మాటలను బట్టి చూస్తే సుశాంత్ కి ఆమె బ్రేక్ అప్ చెప్పేలా మహేష్ భట్ ప్రోత్సహించారు అని అర్థం అవుతుంది. నన్ను బంధనాలు నుండి మీరు విముక్తిరాలిని చేశారు అని రియా చక్రవర్తి మహేష్ భట్ కి సందేశం పంపగా, దానికి సమాధానంగా మహేష్ భట్..ఇక గతం వైపుకు చూడకు అని రిప్లై ఇచ్చారు.



మహేష్ భట్ మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని, ఆయన అపరిమిత ప్రేమ తన మనసు లోతుల్లోకి వెళ్లిందని రియా చాట్‌లో చెప్పింది. ఇక ఇప్పటికే ఫోన్ కాల్స్ పై నిఘా వేసిన పోలీసులు మహేష్ భట్, రియా మధ్య 18 కాల్స్ కొనసాగినట్లు కనుగొన్నారు.