సుశాంత్‌ మరణంపై మరో డౌట్.. నమ్మకస్థుడైన శ్యామ్యూల్ మిస్సింగ్

సుశాంత్‌ మరణంపై మరో డౌట్.. నమ్మకస్థుడైన శ్యామ్యూల్ మిస్సింగ్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ రోజుకో అనుమానం వ్యక్తం అవుతోంది. వీటిపై రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దాంతో పాటు అత్యంత నమ్మకస్తుడైన శ్యామ్యూల్ హోకిప్ మిస్సింగ్ అవడం వెనుక ఉన్న కారణాలు ఏంటని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నిస్తున్నారు.

సుశాంత్‌ మరణించిన సమయంలో బాంద్రాలోని ఆయన నివాసానికి రెండు అంబులెన్సులు రావడంపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మరణిండానికి ముందు రోజు అంటే జూన్ 13వ తేదీ రాత్రి ఆయనతో పాటు ఇంట్లో శామ్యూల్ హోకిప్ కూడా ఉన్నారనే విషయం బయటపడింది. ఇటీవల ఓ టీవీ ఛానల్‌ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఇదే విషయం బయటకు వచ్చింది.

సుశాంత్ మరణం తర్వాత నుంచి శ్యామ్యూల్ కనిపించకుండా పోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం వెనుక ఏదో సీక్రెట్ ఉందంటూ పలు అనుమానాలకు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని రోజులు కనిపించకుండా ఉన్నాడంటే అసలు శామ్యూల్ బతికే ఉన్నాడా? చనిపోయాడా? అని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నిస్తున్నారు. అదే సమయానికి రెండు అంబులెన్సులు ఎందుకు వచ్చాయి? వాటి కోసం ఎవరు కాల్ చేశారు? సుశాంత్ మరణం రోజున రెండు మృతదేహాలు అంటూ సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు దేహాలు వెళ్లాయనే ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఒక ఫోటోలో కాళ్లు నిటారుగా ఉంటే మరో ఫోటోలో కాళ్లు ముడుచుకొని ఉన్నాయి. తాజాగా సుబ్రమణ్యస్వామి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ ఫోటోలకు సంబంధించిన విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సుశాంత్ డెడ్ బాడీకి పోస్టు మార్టం చేసిన డాక్టర్‌ను ఓ సారి విచారణ జరపాలని సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు.