Sushant ఆ మెడిసిన్ తీసుకోలేదు: ముంబై పోలీస్

  • Published By: Subhan ,Published On : June 14, 2020 / 04:46 PM IST
Sushant ఆ మెడిసిన్ తీసుకోలేదు: ముంబై పోలీస్

బాలీవుడ్ యాక్టర్, ఎంఎస్ ధోనీ ‘ద అన్‌టోల్డ్ స్టోరీ’ హీరో జూన్ 14 మధ్యాహ్నం ఆత్మహత్మకు పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ముంబైలోని అతని ఇంటికి వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. అనుమానించేలా ఏమీ కనిపించలేదని ఘటనాస్థలంపై స్పందించారు. 2-2.30 సమయంలో బాంద్రా పోలీసులకు సమాచారం రావడంతో అతని ఇంటికి వెళ్లి చూసేసరికి బెడ్ పై పడి ఉన్నాడు. 

దానిని బట్టి సూసైడ్ ఉదయం 10నుంచి 1గంట మధ్యలో చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు. సుశాంత్ 5-6నెలలుగా డిప్రెషన్ లోకి ఉంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను రెగ్యూలర్ గా వెళ్లే హిందూజా హాస్పిటల్ డాక్టర్ అతనికి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లుగా తెలిసింది. డాక్టర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. 

రాజ్‌పుత్ సోదరితో పాటు అతని మేనేజర్ కూడా డిప్రెషన్ తో ఉంటున్నాడని చెప్పారు. అలా ఉంటున్నా అతను దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం మానేశాడని ముంబై పోలీసులు చెబుతున్నారు. 

ఘటన వివరాలిలా ఉన్నాయి:
రాజ్‌పుత్ రోజూలాగే ఉదయం 6-6.30సమయానికి నిద్రలేచాడు. 
గది నుంచి బయటకు వచ్చాడు. 9.30సమయంలో దానిమ్మ జూస్ తాగాడు. 
ఉదయం 10గంటల 30నిమిషాల సమయంలో వంట చేసేందుకు పనివాళ్లు ఏం ప్రిపేర్ చేయాలని అడిగితే సమాధానం ఇవ్వలేదు. 
11-11.30సమయంలో మళ్లీ వంటవారు, హెల్పర్లు తలుపు కొట్టినా ఎటువంటి రెస్పాన్స్ లేదు.
రాజ్‌పుత్ స్టాఫ్ అతని మొబైల్ కు డయల్ చేసినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. 
వారంతా రాజ్‌పుత్ సిస్టర్‌కు కాల్ చేసి అక్కడకు రావాల్సిందిగా కోరారు. 
ఆమె వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది. 1.15నిమిషాలకు కాల్ చేస్తే 1గంట 30నిమిషాలకు అక్కడకు చేరుకుని తలుపు తీసింది. 
అప్పటికే అతను సీలింగ్ కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. 
పచ్చ రంగు కుర్తాతో ముడి వేసుకున్నాడు. 
స్టాఫ్ బాడీని కిందకు దింపి కత్తితో ముడిని కోశారు. 
అంబులెన్స్ సర్వీసుకు కాల్ చేశారు స్టాఫ్.