రియా తండ్రులు ఇద్దరు సుశాంత్‌సింగ్‌ హత్యకు కుట్ర చేశారు- సునీల్ శుక్లా

  • Published By: vamsi ,Published On : August 24, 2020 / 07:39 AM IST
రియా తండ్రులు ఇద్దరు సుశాంత్‌సింగ్‌ హత్యకు కుట్ర చేశారు- సునీల్ శుక్లా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ బృందం వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సుశాంత్‌ది ఆత్మహత్య కారణంగా మరణం కాదంటూ సుశాంత్ స‌న్నిహితుడు, జిమ్ పార్ట్‌న‌ర్ సునీల్ శుక్లా ఆరోపణలు చేశారు. డాక్టర్ అయినటువంటి రియా చక్రవర్తి తండ్రి, తండ్రిలా చెప్పుకునే ఇంకో తండ్రి మహేష్ భట్ సుశాంత్‌ని చంపేశారంటూ సునీల్ శుక్లా తీవ్రమైన ఆరోపణలు చేశారు.



నేషనల్ మీడియా ఛానెల్ టైమ్స్ నౌతో మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యను రియా చక్రవర్తి ‘ఇద్దరు డాడీలు’ ప్లాన్ చేసినట్లు చెప్పారు. వారు రియా చక్రవర్తి సొంత తండ్రి మరియు మరొకరు అతని ‘షుగర్ డాడీ’ మహేష్ భట్ అని అన్నారు. సుశాంత్‌కు దూరమైన తర్వాత రియా తన తండ్రి ఇచ్చిన మందులను సుశాంత్‌ వేసుకునేలా చేసిందని, రియా ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఇంటిలోని వ్యక్తి అతనికి మెడిసిన్ ఇచ్చారని సునీల్ శుక్లా చెప్పుకొచ్చారు.

ఇంట్లో సుశాంత్‌తో పాటు, అతని ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పిథాని, కుక్ నీరజ్ మరియు మేనేజర్ దీపేష్ సావంత్ ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి మాట్లాడుతూ.. సుశాంత్ మానసిక సామర్థ్యానికి ఇబ్బందేం లేదని సునీల్ శుక్లా అన్నారు. సుశాంత్‌ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ మాత్రమే తీసుకునేవారని ఆయన వెల్లడించారు. ఇంతకుముందు కూడా సునీల్ శుక్లా షారూక్ ఖాన్ వ‌ల్ల సుశాంత్ బాధ‌ప‌డ్డ ఘ‌ట‌న‌ను గురించి చెప్పాడు. 2013లో జ‌రిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో స్టేజీపై సుశాంత్‌ను షారూక్ అవ‌మానించార‌ని అన్నారు.



సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబైలోని బాంద్రాలోని తన ఇంటిలో చనిపోయాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడటం, మనీలాండరింగ్ ఆరోపణలపై సుశాంత్ తండ్రి కెకె సింగ్ పాట్నాలో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రియా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది.

సుశాంత్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో రియా చక్రవర్తి, ఆమె కుటుంబంతో పాటు సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీ, హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా కూడా నిందితులుగా ఉన్నారు. ప్రాథమిక విచారణ నిర్వహించిన వెంటనే సిబిఐ ఈ ఆరుగురు నిందితులను కూడా విచారిస్తుంది.