Sushanth sing Rajput : సుశాంత్ గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ డేటా కావాలి.. సుశాంత్ కేసులో మరో మలుపు

తాజాగా మరోసారి సిబిఐ సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ట్రై చేస్తుంది. సుశాంత్ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్ని

Sushanth sing Rajput : సుశాంత్ గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ డేటా కావాలి.. సుశాంత్ కేసులో మరో మలుపు

Sushanth

Sushanth sing Rajput :  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో కొన్ని నెలలు ఇదే విషయంపై చర్చ జరిగింది. ఫోరెన్సిక్ బృందం సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, అది ఆత్మహత్య కాదు హత్య అని చాలా మంది అభిప్రాయపడ్డారు. లేదా ఆత్మహత్యకి ప్రేరేపించారు అని తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ మరణం తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తు చేసి ఆత్మహత్యగా నిర్ధారించారు. ఆ తర్వాత ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లగా తీవ్ర విచారణ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఆమె సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని సుశాంత్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపించడంతో సుశాంత్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Hyper Aadi : ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వాళ్ళందర్నీ.. సైలెంట్ గా హైపర్ ఆది సెటైర్

ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. సుశాంత్ కేసు నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా మారింది. చాలా మంది సెలబ్రిటీలను ఈ కేసులో విచారించారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారణ అనంతరం విడిచిపెట్టారు. సంవత్సరం పైగా కావొస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చాలా మంది ఈ కేసుని మర్చిపోయారు కూడా. సిబిఐ కూడా ఎన్ని విచారణలు చేసినా సుశాంత్ విషయంలో ఓ నిర్దారణకు రాలేదు.

S.Thaman: మహేష్, ప్రభాస్ మల్టీస్టారర్.. తమన్ ట్వీట్ వైరల్!

తాజాగా మరోసారి సిబిఐ సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ట్రై చేస్తుంది. సుశాంత్ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాల్లో విచారణ చేయొచ్చు అని సిబిఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు విషయంలో సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. సిబిఐ మ్యూచ్‌వల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ (MLAT) కింద డిలీట్‌ అయిన సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలని గూగుల్‌, ఫేస్‌బుక్‌లను కోరింది. కాలిఫోర్నియాలోని గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రధానకార్యాలయానికి వెళ్లి సీబీఐ సుశాంత్ సోషల్ మీడియా డేటా కావాలని కోరింది. సుశాంత్‌ సింగ్‌ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోవడంతో డిలీటైన చాట్‌, ఈ మెయిల్స్ కోరినట్లు సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌ తెలిపారు.