ఫిట్ నెస్ మంత్రం : వర్కౌట్స్ తో వావ్ అనిపిస్తున్న సుస్మితా 

10TV Telugu News

ఒక్కప్పటి హీరోయిన్..మోడల్, మాజీ  మిస్ ఇండియా సుష్మితాసేన్ నేటి యువతరం హీరోయిన్ల అందానికి ఏమాత్రం తగ్గదు. చక్కటి ఫిట్ నెస్ పాటిస్తు స్లిమ్ గా ఉంటుంది. బాలీవుడ్ లో అందరూ ఫిట్ నెస్ మంత్రం జపిస్తుంటారు. ఏజ్ బార్ అయిన హీరోయిన్లు కూడా వర్కైట్స్ చేస్తూ..చక్కటి ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేస్తుంటారు. 

ప్రముఖ తారలంతా నాజూకైన శరీరాకృతి కోసం ప్రతిరోజూ గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నారు. కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న సుష్మితా సేన్ వావ్ అనిపిస్తోంది. తన  43 సంవత్సరాల వయస్సులో ఆమె చేస్తున్న వర్కౌంట్స్ చూస్తే వావ్ అనిపించకమానదు. జిమ్ లో ఆమె చేస్తున్న ఈ వర్కౌంట్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…తన ఫ్యాన్స్‌ని కూడా ఫిట్‌నెస్ విషయంలో చైతన్యం చేస్తోంది సుష్మిత.

లేటెస్ట్‌గా ఈ బాలీవుడ్ సుందరి తన వర్కౌట్‌కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో కూడా సుష్మితా హార్ట్ వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.