Hari Hara Veera Mallu: వీరమల్లు సైలెంట్ కావడంతో అభిమానుల్లో మళ్లీ కన్ఫ్యూజన్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్‌కు వరుసగా బ్రేక్ ఇస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Hari Hara Veera Mallu: వీరమల్లు సైలెంట్ కావడంతో అభిమానుల్లో మళ్లీ కన్ఫ్యూజన్..?

Suspense Continues On Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదే. పీరియాడికల్ ఫిక్షన్ కథగా వస్తున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు పవన్. ఇక ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తయినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం మరో హీరో వస్తున్నాడా..?

కానీ, ఈ సినిమా షూటింగ్‌కు వరుసగా బ్రేక్ ఇస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాతో పాటు పవన్ వరుసగా సినిమాలు చేస్తుండటం.. వాటి షూటింగ్స్ కోసం ఈ సినిమాకు బ్రేక్ ఇవ్వడంతో హరిహర వీరమల్లును ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాను 2023 వేసవి కానుకగా తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో, ఈ సినిమా ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు.

Hari Hara Veera Mallu: వీరమల్లుకు ఇక ఆ ఒక్క ఛాన్సేనా..?

అయితే, ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ, వీరమల్లు చిత్ర యూనిట్ నుండి మాత్రం ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ రావడం లేదు. దీంతో ఈ సినిమా దసరా రిలీజ్ కూడా అనుమానమే అని అంటున్నారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.